RadhikaKumaraswamy: మాజీ ముఖ్యమంత్రి భార్య తెలుగు సినిమాలో...

ABN , First Publish Date - 2023-05-15T15:57:22+05:30 IST

కర్ణాటకలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న సందిగ్ధంలో ఒక పక్క ఉంటే, ఇంకో పక్క కింగ్ మేకర్ అయిపోతాను అనుకొని చివరికి 20 స్థానాలకు సరిపెట్టుకున్న కుమారస్వామి, ఇలా ఉంటే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి భార్య హైదరాబాద్ లో తెలుగు సినిమాలో డెబ్యూ చేసింది.

RadhikaKumaraswamy: మాజీ ముఖ్యమంత్రి భార్య తెలుగు సినిమాలో...
Shreyas Talpade with Radhika Kumaraswamy at the launch of Ajagratha film

అల్లు అర్జున్ (AlluArjun) నటించిన 'పుష్ప' (Pushpa) హిందీలో కూడా విడుదల అయింది, అక్కడ కూడా అతని డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పిన హిందీ నటుడు ఎవరో కాదు, శ్రేయాస్ తల్పడె (ShreyasTalpade). అల్లు అర్జున్ కి ఎంత పేరు వచ్చిందో శ్రేయాస్ కూడా అంతే పేరు వచ్చిందని అంటారు. ఇప్పుడు ఈ శ్రేయాస్ తల్పడె తెలుగు సినిమాలో నటిస్తూ, ఇక్కడ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తున్నాడు. ఆ సినిమా పేరు 'అజాగ్రత్త'. (Ajagratha)

అయితే ఇందులో ఇంకో ఆసక్తికర అంశం వుంది. ఈ సినిమాలో కథానాయిక ఎవరో తెలుసా, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య. ఆమె ఎవరో కాదు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి (HDKumaraswamy) భార్య, రాధిక (RadhikaKumaraswamy) ఇందులో కథానాయికగా వేస్తున్నారు. ఈ సినిమా నిన్న హైదరాబాద్ లో లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు ఎ ఎం రత్నం (AM Ratnam), ఠాగూర్ మధు (TagoreMadhu) లు హాజరయ్యారు. ఈ చిత్రానికి ఎం శశిధర్ దర్శకత్వం వహిస్తుండగా, రవి రాజ్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ లీడ్ పెయిర్ తో పాటు, రావు రమేష్ (RaoRamesh), ఆదిత్య మీనన్ (AdityaMenon), సునీల్ (Sunil) ఇంకా మరికొంతమంది నటులు కూడా వున్నారు. ఇది తెలుగు, కన్నడ, హిందీ భాషలతో కలిపి మొత్తం ఏడు భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తామని చెప్పారు నిర్వాహకులు.

radhikakumaraswamy1.jpg

ఈ సినిమాకి నిర్మాతగా మొదట ఉండాలని అనుకున్నాను అని, కానీ ఈ కథకి హీరోయిన్ ఎవరూ దొఅరాటం లేదని దర్శకుడు కంగారు పడుతుంటే, నేను చెయ్యాలా అని అడిగితే, అప్పుడు కథ చెప్పాడు. కథ నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాను అని, చాలా రోజుల తరువాత మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నాను అని, రాధికా కుమారస్వామి చెప్పారు. తనకి అవకాశం ఇచ్చిన అన్నయ్య నిర్మాతకు, డైరెక్టర్ శశికి థాంక్స్ చెప్పారు రాధికా. శ్రేయాస్ ఇది వరకు నటించిన సినిమాలు చూశానని, ఆయన ఎంతో బాగా నవ్విస్తారు, ఈ సినిమాతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది, అని రాధిక అన్నారు.

Updated Date - 2023-05-15T15:57:22+05:30 IST