ఐరాసలో ‘కాంతార’
ABN , First Publish Date - 2023-03-18T00:19:53+05:30 IST
మన భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కన్నడలో రూపొంది, దేశ వ్యాప్తంగా జనాదరణ పొందిన ‘కాంతార’ని శుక్రవారం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు...

మన భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. కన్నడలో రూపొంది, దేశ వ్యాప్తంగా జనాదరణ పొందిన ‘కాంతార’ని శుక్రవారం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి హాజరయ్యారు. ‘ప్రకృతితో మనుషులకు ఉండాల్సిన అనుబంధం ఎలాంటిదో ‘కాంతార’లో చెప్పాం. ఇలాంటి చిత్రాలు పర్యావరణానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి మార్గం సూచిస్తాయ’’ంటూ రిషబ్ శెట్టి ఓ ట్వీట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకొన్నారు.