Actress Kanchana: ఐదు లక్షలు నాకు కొత్తేమీ కాదు... కానీ ఆయన ఎక్కువ అనుకున్నారు!

ABN , First Publish Date - 2023-03-26T16:50:44+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి (Rajmouli) తనని అవమానించారని ఒకప్పటి అందాల నటి కాంచన అన్నారు.

Actress Kanchana: ఐదు లక్షలు నాకు కొత్తేమీ కాదు... కానీ ఆయన ఎక్కువ అనుకున్నారు!

దర్శకధీరుడు రాజమౌళి (Rajmouli) తనని అవమానించారని ఒకప్పటి అందాల నటి కాంచన (Kanchana) అన్నారు. ‘సువర్ణ సుందరి’ మొదలుకొని సౌత్‌తోపాటు హిందీలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయిక ఆమె. 1986 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ‘అర్జున్‌రెడ్డి’ (Arjun reddy)సినిమాలో విజయ్‌ దేవరకొండకు బామ్మగా నటించారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తనని అవమానించారని ఆరోపించారు. ‘బాహుబలి’ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు. (Kanchana Comments on Rajamouli)

ఈ మేరకు కాంచన మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. రెండు రోజులు షూటింగ్‌కి నా డేట్స్‌ అడిగారు. నేను రూ.5 లక్షలు రెమ్యునరేషన్‌ అడిగాను. అంత ఇవ్వడానికి ఆయన చాలా ఆలోచించారు. నా పాత్రకు అది ఎక్కువ అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని చెప్పి నన్ను వద్దనుకున్నారు. అది నాకు పెద్ద అవమానంగా అనిపించింది. ‘రాజమౌళిలాంటి స్టార్‌ డైరెక్టర్‌కు అది పెద్ద అమౌంట్‌ కాదు. నాకు ఆ డబ్బు పెద్ద విషయమే కాదు. కానీ, నా లాంటి వారికి ఇస్తే అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. నేను సేవలకే ఉపయోగిస్తాను. అదే ముసలి హీరోలకు మాత్రం భారీ మొత్తంలో ఇస్తారా? నేను ఎవర్నీ విమర్శించడం లేదు. నాలాంటి ఆర్టిస్టుల కష్టాలను ఉద్దేశించి ఈ కామెంట్స్‌ చేస్తున్నా. నేటితరం మేకర్స్‌కు ఆర్టిస్ట్‌ల కష్టాల గురించి తెలీదు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-26T16:50:46+05:30 IST