Project K : ప్రభాస్‌కు విలన్‌గా... నిజమేనా?

ABN , First Publish Date - 2023-05-31T13:54:24+05:30 IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాలుగు చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. వాటిలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్‌ - కె’ (Project k)ఒకటి. ఈ చిత్రంలో మరో అగ్ర హీరో భాగం కానునట్లు వార్తలొస్తున్నాయి(Kamal haasan for Prabhas). సౌత్‌ స్టార్‌, విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారట.

Project K : ప్రభాస్‌కు విలన్‌గా... నిజమేనా?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాలుగు చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. వాటిలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్‌ - కె’ (Project k)ఒకటి. భారీ క్యాస్టింగ్‌తో రూపొందుతున్న చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పడుకోన్‌ కథానాయిక. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో మరో అగ్ర హీరో భాగం కానునట్లు వార్తలొస్తున్నాయి(Kamal haasan for Prabhas). సౌత్‌ స్టార్‌, విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ... సినిమాలో కమల్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ (Kamal haasan) చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులోనూ ఆయనది విలన్‌ పాత్ర అని టాక్‌ వినిపిస్తోంది. అసలు విషయం ఏంటనేది తెలియాలంటే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటన ఇవ్వాల్సిందే.

ప్రభాస్‌ సరసన దీపికా పడుకోన్‌ 9Deepika padukone) నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. మునుపెన్నడు చూడని అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌గా, విజువల్‌ ఫీస్ట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్‌, ‘రాజా డీలక్స్‌ చిత్రాలు కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటన్నాయి.

Updated Date - 2023-05-31T13:55:35+05:30 IST