ProjectK-Kamal Haasan: ఆయన రాకతో జర్నీ విశ్వవ్యాప్తం కానుంది!

ABN , First Publish Date - 2023-06-25T12:27:06+05:30 IST

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌ అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. నాగ అశ్విన్‌ (NagaAswin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ (Vyjayanthi movies) సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ కీలక పాత్ర పోషించబోతున్నారని కొద్ది రోజులుగా వార్త వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ ‘ప్రాజెక్ట్‌కె’లో భాగం కానున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది.

ProjectK-Kamal Haasan: ఆయన రాకతో జర్నీ విశ్వవ్యాప్తం కానుంది!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌ అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. నాగ అశ్విన్‌ (NagaAswin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ (Vyjayanthi movies) సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ కీలక పాత్ర పోషించబోతున్నారని కొద్ది రోజులుగా వార్త వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఈరోజు 12 గంటలకు ఇవ్వబోతున్నాం అంటూ సోషల్‌ మీడియాలో నిర్మాణ సంస్థ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే! ఆ సస్పెన్స్‌కు తెరదింపుతూ ఆదివారం 12 గంటలకు లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ ‘ప్రాజెక్ట్‌కె’లో (Kamal Haasan in Project K)భాగం కానున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. ‘‘విశ్వనాయకుడికి స్వాగతం. ఇకపై మా జర్నీ విశ్వవ్యాప్తం’ కానుంది అని నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. కమల్‌ రాకతో ఈ చిత్రానికి భారీతనం వచ్చిందని అభిమానులు ఆనందిస్తున్నారు. ‘ప్రాజెక్ట్‌ కె’ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించనున్నారు నాగ అశ్విన్‌.

123.jpg

కథ డిమాండ్‌ మేరకు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషస్తున్నారు. దీపికా పడుకోన్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే వీరిపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలో కమల్‌హాసన్‌ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. శంషాబాద్‌ పరిసర ప్రాంతంలో వేసిన ఓ సెట్‌లో జరిగే షూటింగ్‌లో కమల్‌ అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. ఇందులో ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించనున్నారని సమాచారం. ఆ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుంది. ఈ సినిమా పేరుని, మోషన్‌ పోస్టర్‌ని జులై 3న అమెరికాలో ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2023-06-25T12:53:20+05:30 IST