Kamal Haasan - Kalki 2989 AD: ఆ విషయాన్ని ప్రభాస్‌ నమ్మలేదు..

ABN , First Publish Date - 2023-07-24T20:10:29+05:30 IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌. ఇటీవల ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను శాన్‌ డియాలో కామిక్‌కాన్‌ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా హాలీవుడ్‌ పత్రికలతో ముచ్చటించారు.

Kamal Haasan - Kalki 2989 AD: ఆ విషయాన్ని ప్రభాస్‌ నమ్మలేదు..

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంతో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal haasan). ఇటీవల ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను శాన్‌ డియాలో కామిక్‌కాన్‌ (San diago) వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా హాలీవుడ్‌ పత్రికలతో ముచ్చటించారు. ‘‘కల్కి 2898 ఏడీ’ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానంటే ఎవరూ నమ్మలేదు. నిజం చెప్పాలంటే శాన్‌ డియాగో కామికాన్‌ ఈవెంట్‌ కోసం వచ్చిన సమయంలో ప్రభాస్‌ నా చేయి పట్టుకుని.. ‘థ్యాంక్యూ సార్‌. మీరు మా సినిమాలో నటిస్తున్నారంటే ఈరోజు వరకూ నేనూ నమ్మలేదు. టీమ్‌ మిమ్మల్ని ఎలా ఒప్పించారనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది’ అని చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము పురాణాలను ఫాలో అవుతున్నాం. ఆ పురాణాల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమే నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేనూ ఇందులో సంతోషంగా భాగమయ్యా. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్‌ కూడా అంతే అవసరం. అందుకే, ప్రతి నాయకుడిగా కనిపించడానికి అంగీకరించా’’ అని కమల్‌హాసన్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-07-24T20:10:29+05:30 IST