Project K: కమల్‌హాసన్‌ సై అన్నట్లేనా?

ABN , First Publish Date - 2023-06-09T17:00:52+05:30 IST

విక్రమ్‌ సినిమా సక్సెస్‌తో మళ్లీ జోరు పెంచారు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్‌2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఆయనకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే! ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రంలో కమల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారనే వార్త కొద్ది రోజులుగా వైరల్‌ అవుతుంది.

Project K: కమల్‌హాసన్‌ సై అన్నట్లేనా?

విక్రమ్‌ సినిమా సక్సెస్‌తో మళ్లీ జోరు పెంచారు విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal haasan). ప్రస్తుతం ఆయన ‘ఇండియన్‌2’ (Indian 2) చిత్రంతో బిజీగా ఉన్నారు. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఆయనకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే! ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’(Project K) చిత్రంలో కమల్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారనే వార్త కొద్ది రోజులుగా వైరల్‌ అవుతుంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ కమల్‌ను అప్రోచ్‌ అయ్యారని, కీలక పాత్ర కోసం వివరించారని సమాచారం. అయితే దీనిపై వైజయంతీ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

శుక్రవారం నుంచి ఈ సినిమాకు సంబందించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా చేయడానికి కమల్‌హాసన్‌ సై అన్నారని 30 రోజుల కాల్షీట్‌కు రూ. 100 కోట్లు రెమ్యునరేషన్‌ (100 cr for 30 Days) అని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్‌ భాగమైతే సౌత్‌లో సినిమాకు మరింత క్రేజ్‌, బిజినెస్‌ జరుగుతోందని వైజయంతీ సంస్థ భావిస్తోందట. ఈ ఏడాది చివర్లో కమల్‌ సెట్‌లో అడుగుపెడతారని తెలుస్తోంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం కోసం శంషాబాద్‌ లో భారీ టైమ్‌ మెీషీన్‌ సెట్‌ సిద్ధమవుతోంది. (Kamal haasan for Project k)

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పడుకోన్‌ కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సిజ అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-06-09T17:00:52+05:30 IST