Kajal: ఆ ఆత్మతో సంబంధం ఏంటి?

ABN , First Publish Date - 2023-03-10T17:52:18+05:30 IST

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్‌ (kajal)మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 5 చిత్రాలున్నాయి.

Kajal: ఆ ఆత్మతో సంబంధం ఏంటి?

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్‌ (kajal)మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 5 చిత్రాలున్నాయి. తాజాగా ఆమె నటించి ‘ఘోస్టీ’(Ghosty) చిత్రం ఉగాది సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్‌ యోగిబాబు (yogibabu) కీలక పాత్రధారులు. కళ్యాణ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్‌ పోలీస్‌, హీరోయిన్‌గా ద్విపాత్రాభినయం చేశారు.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ‘‘కాజల్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తారు. రెండు పాత్రలు వ్యత్యాసంగా ఉంటాయి. ఓ ఆత్మకు, కాజల్‌ పాత్రకు సంబంధం ఏంటి, అసలు ఈ కథలోకి ఆత్మలు ఎలా వచ్చాయి? అనేది ఆసక్తికరం’’ అని అన్నారు.

Updated Date - 2023-03-10T17:52:32+05:30 IST