Kajal : ఆ లక్షణాలన్నీ శ్రీలీలలో ఉన్నాయి.. తిరుగులేదు..

ABN , First Publish Date - 2023-10-12T15:45:12+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ బ్యూటీ శ్రీలీల(Shree leela). వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అనిల్‌ రావిపూడి దరకత్వం వహించిన 'భగవంత కేసరి' చిత్రంలో విజ్జి పాత్రలో నటించింది. ఇందులో బాలకృష్ణ సరసన కథానాయికగా కాజల్‌ నటించారు. ప్రస్తుతం ప్రమోషన్స జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వూలో కాజల్‌ (kajal) శ్రీలీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Kajal : ఆ లక్షణాలన్నీ శ్రీలీలలో ఉన్నాయి.. తిరుగులేదు..

ప్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ బ్యూటీ శ్రీలీల(Shree leela). వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె అనిల్‌ రావిపూడి దరకత్వం వహించిన 'భగవంత కేసరి' చిత్రంలో విజ్జి పాత్రలో నటించింది. ఇందులో బాలకృష్ణ సరసన కథానాయికగా కాజల్‌ నటించారు. ప్రస్తుతం ప్రమోషన్స జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వూలో కాజల్‌ (kajal) శ్రీలీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సినిమాలతో పాటు వ్యక్తిగతంగా ఎదగడం చాలా ముఖ్యం. నేను నమ్మిన వృత్తి నటన. సినిమాను అమితంగా ప్రేమిస్తాను. నా మొదటి ప్రాధాన్యం సినిమానే. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ చాలా పనులు చేస్తున్నాను. సవాల్‌గా తీసుకుంటేజీవతంలో ఏదైనా సాధించగలం. ఇవే లక్షణాలను శ్రీలీలలో చూశా. తను చాలా తెలివైన అమ్మాయి. గమనించా. పాత్రకు 100 శాతం బెస్ట్‌ ఇవ్వడ కోసం ఎంతో కష్టపడుతుంది. అది నేను గమనించా. అందరితో చాలా గౌరవంగా, విధేయతతో ఉంటుంది.. తనేం చేయాలనుకుంటుందో తనకు తెలుసు. లైఫ్‌ మీద తనకొక క్లారిటీ, ప్లానింగ్‌ ఉంది. ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సెట్‌లో అందరితో చాలా సరదాగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు చాలా అవసరం’’ అని కాజల్‌ అన్నారు.

Updated Date - 2023-10-12T18:11:25+05:30 IST