K Viswanath: సినిమా అనే బస్సు.. దానిని నడిపే డ్రైవర్‌ని!

ABN , First Publish Date - 2023-02-03T13:43:21+05:30 IST

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ పరమపదించడంతో యావత్‌ సినీ రంగం విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు,, అభిమానులు ఆయన్ని కీర్తిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సినిమా జీవితం, దర్శకత్వం జర్నీ గురించి ఆయన చెప్పుకొచ్చిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

K Viswanath: సినిమా అనే బస్సు.. దానిని నడిపే డ్రైవర్‌ని!

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (K Viswanath) పరమపదించడంతో యావత్‌ సినీ రంగం విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు,, అభిమానులు ఆయన్ని కీర్తిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సినిమా జీవితం, దర్శకత్వం (kala tapasvi K Viswanath) జర్నీ గురించి ఆయన చెప్పుకొచ్చిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘సినిమా అనే ఓ బస్సు పట్టుకుని.. సినిమా చూసే ప్రేక్షకులను భక్తులుగా భావించి, నేను బస్సు నడిపే డ్రైవర్‌ని. నేనేం చేయాలి నేను?’’ అన్న వీడియో ఇప్పుడు ఆయనకు నివాళిగా వైరల్‌ అవుతోంది. సినిమా రంగానికి ఆయనెంతో చేశారు. అద్భుతమైన చిత్రాలను అందించారు. అలాగే ఆయన సెట్‌లో ఖాకీ దుస్తులు ధరించి పని చేస్తున్న ఫొటోలు కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. (Rip K Viswanath)

అన్ని ఏళ్లు బతుకుతాం అనుకోవాలట..

జీవితం అంటే మరేదో కాదు.. జీవించడమే. ఇప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించినా, ఆలోచించకపోయినా.. ఓ భయం మాత్రం ఉంటుంది. అది మరణం గురించే. ఇలాంటి భయాలు ఉండకూడదు అని నాతో చాలా మంది చెప్పారు. ఎవరైనా సరే.. 118 ఏళ్లు బతుకుతాం అనుకోవాలట. 118వ పుట్టిన రోజున ఏం బట్టలు వేసుకోవాలి? ఎవర్ని పిలవాలి? కేక్‌ ఎలా కట్‌ చేయాలి? అనే ఆలోచనలతో బతకాలట. 90 ఏళ్లు దాటేశాయి. జీవితం మొత్తం అయిపోయింది అనుకోకూడదట. పిల్లలు సెటిలైపోయారు. వాళ్ల గురించి బెంగ లేదు. అలయితే ఈ వయసులో బెంగలు విచిత్రంగా ఉంటాయి. ముని మనవడికి ఏమైనా అయితే.. మనసు తట్టుకోలేదు. వాళ్లకు జ్వరం వస్తే ధ్యాసంతా అటే ఉంటుంది’’ అని ఆయన సున్నిత మనసు గురించి వివరించారు కళా తపస్వీ. (K Viswanath passes away)

Updated Date - 2023-02-03T13:43:48+05:30 IST