Jr NTR: హృతిక్‌ విషెస్‌కి తారక్‌.. థ్యాంక్స్‌!

ABN , First Publish Date - 2023-05-20T18:00:02+05:30 IST

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు ట్విట్టర్‌ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ హృతిక్‌ రోషన్‌. సోషల్‌ మీడియా వేదికగా కాస్త భిన్నంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Jr NTR: హృతిక్‌ విషెస్‌కి తారక్‌.. థ్యాంక్స్‌!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు(Jr ntr) ట్విట్టర్‌ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ హృతిక్‌ రోషన్‌. సోషల్‌ మీడియా వేదికగా కాస్త భిన్నంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నీకోసం యుద్థభూమిలో వేచి చూస్తున్నానంటూ పరోక్షంగా ‘వార్‌ 2’ (War2)సినిమా అప్డేట్‌ ఇచ్చారు హృతిక్‌ (Hrithik Roshan). ‘హ్యాపీ బర్త్‌ డే తారక్‌. ఈ సంతోషకరమైన రోజుని నువ్వు ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నా. నీకోసం నేను యుద్ధభూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిేసంత వరకు ప్రతిరోజూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’’ అంటూ ట్వీట్‌ చేశాడు. వీరిద్దరూ కలిసి వార్‌-2 (War 2) చిత్రంలో కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే!

అయితే హృతిక్‌ శుభాకాంక్షలకు తారక్‌ రిప్లై ఇచ్చారు. ‘‘ప్రేమ పూర్వకంగా మీరు చెప్పిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు సర్‌. మీరు కూడా రోజులు లెక్కించడం ప్రారంభించాలి. యుద్థభూమిలో బాగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నందున మీరు ఎదురుచూస్తున్న దాని కోసం ఆలోచిస్తూ బాగా నిద్రపోతారని ఆశిస్తున్నాను త్వరలో కలుద్దాం’’ అని తారక్‌ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ‘వార్‌-2’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ మొదలు కానుంది. తారక్‌లో తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరో జు సందర్భంగా టైటిల్‌ను, తారక్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తారక్‌ సరసన జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పకుడు.

Updated Date - 2023-05-20T18:03:42+05:30 IST