Jr NTR: కష్టాల్లో అండగా నిలిచింది మీరే!

ABN , First Publish Date - 2023-05-21T13:19:32+05:30 IST

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అభిమానులు, సినీ సెలబ్రిటీల వరకూ అందరూ సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు శుబాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ హృతిక్‌ రోషన్‌ కూడా ఆయనకు విషెస్‌ చెప్పారు.

Jr NTR: కష్టాల్లో అండగా నిలిచింది మీరే!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అభిమానులు, సినీ సెలబ్రిటీల వరకూ అందరూ సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు శుబాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ హృతిక్‌ రోషన్‌ కూడా ఆయనకు విషెస్‌ చెప్పారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన అందరికీ తారక్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. (Thanks Letter to Fans)

‘‘ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎలాంటి పరిస్థితిలోనైనా అభిమానులు నన్ను వదిలిపెట్టలేదు. సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా. ఇప్పటి వరకు నేను నటించిన ప్రతి పాత్ర, చేసిన ప్రతి సినిమా నా అభిమానుల కోసమే చేశాను. నన్ను, నా సినిమాలను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాపై మీరు చూపిస్తున్న అచంచలమైన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. ‘దేవర’ ఫస్ట్‌ లుక్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనకు కృతజ్ఞతలు. అభిమానులంతా కలిసి నా పుట్టినరోజును మరింత అందంగా మార్చారు. ఆ పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు నా ేస్నహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. (Man of Masses)

1210 షోలు.. సరికొత్త ట్రెండ్‌.. (Simhadri)

ఇక ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆయన నటించిన ‘సింహాద్రి’ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌లో డిజిటలైజ్‌ చేసి రీరిలీజ్‌ చేశారు. దీంతో మరోసారి సోషల్‌ మీడియాలో ఈ సినిమా ట్రెండ్‌ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ సుమారు 150కి పైగా థియేటర్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. మొత్తం 1210 షోలు ప్రదర్శించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్ర్కీన్‌ మెల్‌బోర్న ఐమాక్స్‌ థియేటర్‌లోనూ ఈ సినిమాను విడుదల చేయడం విశేషం.

Updated Date - 2023-05-21T13:21:56+05:30 IST