Jr Ntr: అభిమాని మృతిపై తారక్‌ స్పందన

ABN , First Publish Date - 2023-06-27T14:46:04+05:30 IST

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై తాజాగా ఎన్టీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. శ్యామ్‌ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని జూనియర్‌ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Jr Ntr: అభిమాని మృతిపై తారక్‌ స్పందన

జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) అభిమాని శ్యామ్‌ (Syam death) అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. తన అమ్మమ్మ ఊరు అయిన డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్‌ ఈ నెల 25న అనుమానస్పదంగా మృతిచెందాడు. మణికట్టుపై బ్లేడ్‌తో పలుమార్లు కోసుకున్నట్లు, ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం కనిపించింది. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద కేసుగా నమోదుచేసి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎన్టీఆర్‌ అభిమానిగా సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న శ్యామ్‌ మరణంపై తారక్‌ ఫ్యాన్స్‌ అలెర్ట్‌ అయ్యారు. అతని మరణానికి కారణం తెలియాలంటూ, శ్యామ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దీనిపై తాజాగా ఎన్టీఆర్‌ (Ntr reaction) స్పందించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. శ్యామ్‌ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచివేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Untitled-1.jpg

శ్యామ్‌ మృతి గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉరి వేసుకుంటే కాళ్లు నేలకు ఎలా తాకి ఉంటాయి..? శరీరం మీద, ముక్కుమీద గాయాలు ఎందుకున్నాయి? చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుంటే అంత నిలకడగా ఉరి ఎలా వేసుకుంటాడని ప్రశ్నలు సంధిస్తున్నారు. శ్యామ్‌ తండ్రి ఇది హత్యే అని తేల్చి చెబుతున్నారు. హత్య అని ఫిర్యాదు చేేస్త ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారన మండిపడ్డారు. తారక్‌ పిలుపుతో అభిమానులంతా శ్యామ్‌ కుటుంబానికి అండగా ఉంటామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తన చెల్లెలి బాఽధ్యతను తారక్‌ అభిమానులుగా మేం తీసుకుంటాం అని మాటిచ్చారు.

Updated Date - 2023-06-27T15:10:40+05:30 IST