సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

JrNTR: మాస్ అమ్మ మొగుడు స్పెషల్ గెస్ట్ అంట !

ABN, First Publish Date - 2023-03-15T13:25:34+05:30

జూనియర్ ఎన్టీఆర్, ఆస్కార్ అవార్డుల కోసం అమెరికా వెళ్లి, ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకొని, మొదటి సారిగా ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొంటాడు. అది ఏది అంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు అందరి కళ్ళూ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మీదే వున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆస్కార్ (Oscars95) వేడుకలకి వెళ్లి, అమెరికా అంతా సందడి చేసి, అందులో నెంబర్ వన్ గా నిలబడి నిన్ననే ఇండియా చేరుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు తన తదుపరి సినిమా (NTR30) దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) తో ఈ నెలాఖరు నుండి ప్రారంభిస్తాడని చెపుతున్నారు. ఆ సినిమా ఇంక ఏ రేంజ్ లో ఉంటుందో అని పరిశ్రమలో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అదీ కాకుండా ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమా అవెంజర్స్ (Avengers) లో వున్నాడు అన్న వార్త కూడా వైరల్ అయింది.

ప్రపంచం అంతా మారుమోగిన ఎన్టీఆర్ ఇప్పుడు ఒక తెలుగు సినిమాకి ప్రత్యేక అతిధిగా వస్తున్నాడు. విశ్వక్ సేన్ (Vishwaksen) నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా వస్తున్నాడు. దీనికి వాళ్ళు వేసిన పోస్టర్ లో కూడా ఎన్టీఆర్ ని మాస్ కి అమ్మ మొగుడు అని చెపుతున్నారు. ఆస్కార్ నుండి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్ ఈ సినిమాకి ప్రత్యేక అతిధి గా రావటం మొదటి పబ్లిక్ అప్పీయరెన్సు అవుతుంది.

ఈ ఈవెంట్ మాదాపూర్ లోని శిల్పకళా వేదిక లో మార్చి 17న పెట్టారు. ఎన్టీఆర్ అభిమానులు కోకొల్లలుగా ఈ ఈవెంట్ కి రావొచ్చు అని అనుకుంటున్నారు. అదీకాకుండా ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా గురించి ఏమైనా చెప్పే అవకాశం కూడా వుంది అని అంటున్నారు.

Updated Date - 2023-03-15T13:25:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!