Mahanadu: జూనియర్ ఎన్టీఆర్ గురించే అంత డిస్కషన్, ఆ నేత మాటలు ఇప్పుడు సెన్సేషన్

ABN , First Publish Date - 2023-05-27T14:55:46+05:30 IST

తాతగారి నూరో పుట్టినరోజు ఉత్సవాల కన్నా, తన కుటుంబ వెళ్లబోయే టూర్ ముఖ్యమని జూనియర్ ఎన్టీఆర్ భావించాడు. అందుకే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రాలేదు అని ఉత్సవ కమిటి చైర్మన్ టిడి జనార్దన్ చెప్పారు.

Mahanadu: జూనియర్ ఎన్టీఆర్ గురించే అంత డిస్కషన్, ఆ నేత మాటలు ఇప్పుడు సెన్సేషన్
Jr NTR

కొన్ని రోజుల క్రితం హైద్రాబాదులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు #NTRCentenaryCelebrations నిర్వహించారు. ఈ ఉత్సవానికి రాజకీయ ప్రముఖులు తో పాటు, సినిమా పరిశ్రమకి చెందిన చాలామంది నటీనటులు కూడా హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna), రామ్ చరణ్ (RamCharan), నాగ చైతన్య (NagaChaitanya), వెంకటేష్ దగ్గుబాటి (VenkateshDaggubati), శ్రీలీల (Sreeleela) ఇలా చాలామంది తెలుగు చిత్రపరిశ్రమ నుండి తరలి వచ్చారు. రామ్ చరణ్ రావటమే కాకుండా ఎన్టీఆర్ (NTR) గురించి చాలా గొప్పగా చెప్పాడు కూడా. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పక్కన కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్ళాడు చరణ్.

ramcharan-cbn.jpg

ఈ విషయంలో చరణ్ ని ఎంతోమంది అభినందించారు కూడా. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) ఈ ఉత్సవానికి దూరంగా వున్నాడు. రామ్ చరణ్ వచ్చి అంత చక్కగా మాట్లాడాడు, జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) ఎందుకు రాలేదు అని వార్త నెట్టింట బాగా వైరల్ అయింది. ఎన్టీఆర్ వెళ్లి ఉండాల్సింది అని కూడా చాలామంది అన్నారు. ఆరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడాను. ఎందుకు రాలేదు అనే విషయం కూడా అప్పట్లో వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ ఉత్సవ కమిటి చైర్మన్ టిడి జనార్దన్ (TDJanardhan), ఎన్టీఆర్ రాకపోవటం మీద మాట్లాడారు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అతను జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదన్న ప్రశ్నకు అతనికి ముందుగానే ఎదో టూర్ పెట్టుకున్నాడు అని చెప్పాడు. "నేను, నందమూరి రామకృష్ణ గారు అతన్ని అడిగితే వారం రోజుల తరువాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. వెళ్లి కలిసాం, నాకు ఆరోజు టూర్ వుంది అన్నా, 22 కుటుంబాలు కలిసి వెళుతున్నాం. రాలేను," అని చెప్పాడు. అప్పుడు మేము "నీ పుట్టినరోజులు ముందు ముందు చాలా వస్తాయి, కానీ అన్నగారి శతజయంతి ఒక్కసారే వస్తుంది" అని కూడా చెప్పాము. ఉదయం అభిమానులని కలవటానికి వుంటాను అన్నాడు, అని చెప్పారు జనార్దన్. ఎలాగు ఉదయం వుంటారు కదా, సాయంత్రం వరకు వుండి ఆ ఫంక్షన్ కి వచ్చి వెళ్ళండి అని చెప్పాము అని జనార్దన్ చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ అన్న, కళ్యాణ్ రామ్ (NandamuriKalyanram) కూడా ఫంక్షన్ కి రాలేదు అని అడిగినప్పుడు, అతను కూడా ఎన్టీఆర్ తో పాటు ఆ టూర్ కి వెళ్లి ఉండొచ్చు, అందుకనే రాలేదేమో అని జనార్దన్ చెప్పారు.

Updated Date - 2023-05-27T16:13:55+05:30 IST