NTR30: సుమ మీద సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్

ABN , First Publish Date - 2023-02-06T11:48:21+05:30 IST

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆదివారం నాడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'అమిగోస్' (Amigos) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ (Anchor Suma) అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ (Introduction) చెప్పింది. అయితే ఆ చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది, దానికి ఎన్టీఆర్ చాల సీరియస్ అయ్యాడు.

NTR30: సుమ మీద సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆదివారం నాడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'అమిగోస్' (Amigos) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ (Anchor Suma) అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ (Introduction) చెప్పింది. అయితే ఆ చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది, దానికి ఎన్టీఆర్ చాల సీరియస్ అయ్యాడు. అంత కోపంగా ఎన్టీఆర్ ఎప్పుడూ మొహం పెట్టలేదు, అంతలా పెట్టాడు సుమ మాట్లాడుతుంటే.

ఇంతకీ సుమ ఏమి మాట్లాడింది ఆంటే, తన స్వంత కుటుంబం గురించి కానీ, పర్సనల్ కానీ పట్టించుకోని అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ 30 (#NTR30) గురించి చాల ఆతృతగా, ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు అని చెప్పేసరికి ఎన్టీఆర్ (#JrNTR) కి ఎక్కడలేని కోపం వచ్చింది. సుమ వచ్చి మైక్ ఎన్టీఆర్ కి ఇవ్వగానే, వాళ్ళు అడిగారా లేదో కానీ, నువ్వే అన్నీ చెప్పేట్టు వున్నావు అని ఎన్టీఆర్ సుమకి ఒక ఝలక్ కూడా ఇచ్చాడు. అయితే సుమ ఇది వినీ విననట్టుగా ఉండిపోయింది.

tarak-amigos1.jpg

ఎన్టీఆర్ తన 30వ సినిమా కొరటాల శివతో (Koratala Siva) చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ముందు జనవరి లో మొదలవుతుంది అని, తరువాత ఫిబ్రవరి అని అన్నారు, కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ సినిమా ఎప్పుడు మొదలెడతారు అన్న దానిమీద ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వవలసి వచ్చింది, ఎందుకంటే సుమ వలన. ప్రతి సారీ సినిమా మీద ఎదో ఒక వార్త ఇవ్వాలి అంటే కష్టం అని, నిర్మాత, దర్శకుల మీద చాల ఒత్తిడి పెరుగుతుందని అని చెప్పాడు ఎన్టీఆర్. అయితే ఈనెలలోనే ఆ సినిమా లాంచ్ అవుతుందని, మార్చి లో షూటింగ్ మొదలెడతామని, ఏప్రిల్ 5, 2024 లో విడుదల అవుతుందని కూడా చెప్పేసాడు. దీనితో అతని అభిమానులు శాంతించారు.

Updated Date - 2023-02-06T11:48:22+05:30 IST