Ntr 30: తారక్‌ సర్‌ప్రైజ్‌.. కొరటాల క్రియేషన్‌ ఈసారి ఇలా..!

ABN , First Publish Date - 2023-04-10T09:39:50+05:30 IST

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ 30 రూపొందుతున్న సంగతి తెలిసిందే! సూపర్‌ సక్సెస్‌ అయిన ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ntr 30: తారక్‌ సర్‌ప్రైజ్‌.. కొరటాల క్రియేషన్‌ ఈసారి ఇలా..!

ఎన్టీఆర్‌(Ntr)- కొరటాల శివ (koratala siva) కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ 30 (ntr30) రూపొందుతున్న సంగతి తెలిసిందే! సూపర్‌ సక్సెస్‌ అయిన ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఆదివారంతో తొలి షెడ్యూల్‌ పూర్తయిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్‌ గోవాలో ఉంటుందట. దేశంలో ఎవరి ఆదరణ లేకుండా ఉన్న తీరప్రాంత ప్రజల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్తల నెట్టింట చక్కర్తు కొడుతోంది. ఈ కథలో తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తారట. కథానుగుణంగా తారక్‌ తండ్రీ కొడుకల పాత్రల్లో కనిపిస్తారని సోషల్‌ మీడియాలో వార్త హల్‌చల్‌ చేస్తోంది. అయితే దీని గురించి దర్శకుడు గానీ, ఇతర చిత్ర బృందం గానీ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. (Ntr Duel role)

గతంలో ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’(Adhurs) లో డ్యూయల్‌ రోల్‌ చేశారు. ‘జై లవకుశ’ (Jai lavakusa) చిత్రంలో ట్రిపుల్‌ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే! ‘ఎన్‌టీఆర్‌30’లో ద్విపాత్రాభినయం చేస్తే ఆయన పాత్ర ఎలా ఉండబోతోందు అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. కొరటాల శివకు తారక్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. డెఫినెట్‌గా ఎన్టీఆర్‌ మార్క్‌ ఉండేలా ఆ పాత్రల్ని శివ తీర్చిదిద్దుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కొరటాల క్రియేషన్‌ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే! ఈ చిత్రంలో తారక్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌, కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

Updated Date - 2023-04-10T10:19:19+05:30 IST