కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagapathi babu : ఎచ్చులు ఎక్కువై.. కుర్రాడిలా కనిపించాలనే తపనతో...

ABN, First Publish Date - 2023-09-21T10:46:45+05:30

జగపతిబాబు (Jagapathi babu) ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో మంచి ట్రెండింగ్‌లో ఉన్నారు. తన సినిమాల అప్‌డేట్‌లతోపాటు ఆయన చేసే అల్లరి పనులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వినోదాన్ని పంచుతుంటారు.

జగపతిబాబు (Jagapathi babu) ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో మంచి ట్రెండింగ్‌లో ఉన్నారు. తన సినిమాల అప్‌డేట్‌లతోపాటు ఆయన చేసే అల్లరి పనులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి వినోదాన్ని పంచుతుంటారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ‘రుద్రంగి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన నటనతో ఆకట్టుకున్నారు కానీ బాక్సాఫీస్‌ వద్ద అంతగా మెప్పించలేదు. ప్రస్తుతం జగపతిబాబు ‘పుష్ప-2’(Pushpa 2), సలార్‌ (salaar), ‘గుంటూరు కారం’ (guntur Karam) చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో తన జిమ్‌ వర్కవుట్స్‌, ఇంట్లో చేసే పనులు తదితర అంశాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అయితే జగపతిబాబు పోస్ట్‌ చేసేన ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘ఇంతకుముందు పింక్‌ షర్ట్‌ వేసుకున్న‘కుర్రాడిలాగా ఉన్నాని మీరందరూ చెప్పారు. దాంతో ఎచ్చులు ఎక్కువైపోయి నిజంగా కుర్రాడిని అయిపోదాం అని ముఖాన్ని రెడీ చేస్తున్నా’’ అంటూ ఫేస్‌ప్యాక్‌ చేసుకున్న ఫొటోను షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ‘మీరు హ్యాండ్సమ్‌ సార్‌’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అభిమానులు కామెంట్స్‌ చూసే కొద్ది జగ్గూ భాయ్‌ ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో చేస్తుంటారని కూడా నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-21T10:54:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!