Rocking Rakesh: ‘కేసీఆర్‌‘ సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టా: రాకింగ్ రాకేశ్‌

ABN , First Publish Date - 2023-10-30T22:37:43+05:30 IST

ఈటీవీ జ‌బ‌ర్దస్త్ షోతో హ‌స్య న‌టులు ఎందరో వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే ఇప్పుడు అదే కోవ‌లోకి వ‌చ్చాడు రాకింగ్ రాకేశ్. నిర్మాత‌గా త‌నే హీరోగా న‌టిస్తూ కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా గురించి రాకేశ్ ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నాడు.

Rocking Rakesh: ‘కేసీఆర్‌‘ సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టా: రాకింగ్ రాకేశ్‌

ఈటీవీ జ‌బ‌ర్దస్త్(Jabardasth) షోతో హ‌స్య న‌టులు ఎందరో వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే అందులో సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీను, రాం ప్ర‌సాద్, ష‌క‌ల‌క శంక‌ర్‌, ధ‌న‌రాజ్‌, వేణు సినిమాల‌లో మంచి ఆఫ‌ర్లతో దూసుకుపోతున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చినమ‌హేశ్‌, స‌న్నీ, రాకేశ్ వంటి వారు కూడా అడ‌పాద‌డ‌పా సినిమా అవ‌కాశాలు పొందుతున్నారు.

ఇప్పుడు అదే కోవ‌లోకి వ‌చ్చాడు రాకింగ్ రాకేశ్. జ‌బ‌ర్ద‌స్త్‌లో చిన్న‌చిన్న సీన్లు చేసే స్థాయి నుంచి టీమ్ లీడ‌ర్ గా ఎదిగిన‌ ఆయ‌న మ‌రో అడుగు ముందుకేసి నిర్మాత‌గా మారాడు. త‌నే హీరోగా న‌టిస్తూ కేసీఆర్(kcr)(కేశవ్ చంద్ర రమావత్) అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల సినిమాను తెలంగాణ మంత్రి మ‌ల్లారెడ్డి ప్రారంభించారు. అయితే ఓ కార్యక్రమంలో ఈ సినిమా గురించి రాకేశ్ మాట్లాడుతూ ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు మీడియాతో పంచుకున్నాడు.

తెలంగాణ ముఖ్య‌మంత్రికి నేను పెద్ద అభిమానిన‌ని, నేను ఎవ‌రికి బినామీని కాద‌ని నాకు అలా ఉండాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని సీఎం కేసీఆర్‌పై ఉన్న ఇష్టంలోనే నా సినిమాకు ఆయ‌న పేరు పెట్టుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. సినిమా కోసం ఇల్లు, కారు తాకట్టు పెట్టాన‌న్నారు.


అవ‌స‌ర‌మైతేనా నా భార్య సుజాత సాయం చేస్తానంటూ న‌న్ను ఎంక‌రేజ్ చేసింద‌ని అలాంటి భార్య దొర‌క‌డం నా అదృష్టమ‌ని అన్నారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో కొంత‌మంది న‌న్ను టార్గెట్ చేశారు గానీ రోజా గారి ద‌య వ‌ల్ల నిల‌బ‌డ్డాన‌ని నేను టార్గెట్ చేస్తే వాళ్లేవ‌రు నిల‌వ‌లేరు అంటూ ముగించారు. నా సినిమాను త్వ‌ర‌లో ముగించి విడుద‌ల చేస్తాన‌ని ఖ‌చ్చితంగా విజ‌యం సాదిస్తుంద‌న్నారు.

Updated Date - 2023-11-03T13:54:20+05:30 IST