Jabardasth Hari: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడు పరారీ, పోలిసుల గాలింపు

ABN , First Publish Date - 2023-06-13T13:12:57+05:30 IST

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పాపులర్ షో 'జబర్దస్త్' కమెడియన్ హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హరికి ఇలాంటిది మొదటి సారి కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి అక్రమ లావాదేవీల్లో పాల్గొనేవాడని తెలుస్తోంది. ఇంతకు ఏమైందంటే..

Jabardasth Hari: ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడు పరారీ, పోలిసుల గాలింపు
Jabardasth Hari and his lady getup

ఒక టీవీ ఛానల్ లో వస్తున్న కామెడీ షో 'జబర్దస్త్' #Jabardasth చాలా పాపులర్ అయింది. ఇందులో చాలామంది నటులు షకలక శంకర్, (ShakalakaShankar) జబర్దస్త్ మహేష్ (JabardasthMahesh), హైపర్ అది (HyperAdi), చమ్మక్ చంద్ర (ChammakChandra) ఇలా చాలామంది ఈ షో ద్వారా బాగా పాపులర్ అయి, ఇప్పుడు వెండి తెర మీద కూడా కనపడుతున్నారు. ఇందులో కనపడుతున్న చాలామంది కమెడియన్స్ తమ ప్రతిభ పాటవాలు ద్వారా పాపులర్ అవుతున్నారు. ఇలా పాపులర్ అయిన కొంతమంది నటులు అక్రమ లావాదేవీల్లో తమ చేతులు పెట్టి, పేరు పోగొట్టుకుంటున్నారు కూడా.

ఆలా వార్తల్లో వున్న వ్యక్తి జబర్దస్త్ హరి #JabardasthHari, ఇతను జబర్దస్త్ షో లో ఎక్కువగా లేడీ గెటప్ లో కనపడుతూ ఉంటాడు. ఇతను తాజాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో వున్నాడు. పోలీసులు ఇతని కోసాం గాలింపు చేపట్టారని కూడా తెలిసింది. ఇతను చిత్తూరు జిల్లా పుంగనూరు దగ్గర దాదాపు రూ 60 లక్షల రూపాయల విలువుగల ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తూ ఉండగా పోలీసులు చూసారని, వెంటనే అక్కడ నుండి పరారు అయ్యాడని తెలిసింది.

jabardasth-hari1.jpg

అదే కేసులో కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుపడినపుడు, అతన్ని విచారించగా అతను ఈ జబర్దస్త్ హరి పేరు చెప్పాడని, అప్పుడు పోలీసులకు అసలు విషయం తెలిసిందని, వెంటనే హరి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారని కూడా తెలిసింది. ఈ ఎర్ర చందనం సరుకును తరలించే విషయం హరే మొత్తం ప్లాన్ వేసాడని, పట్టుబడ్డ కిషోర్ పోలీసులకు తెలిపాడు. అయితే హరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పోలీస్ ప్రయత్నం చేసినప్పటికీ, హరి తప్పించుకొని పారిపోయినట్లు పోలీసుల తెలిపారు. దీంతో పోలీసులు హరిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న హరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే ఇలా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడటం హరికి ఇదేం మొదటిసారి కాదు అని తెలుస్తోంది. ఇంతకు ముందు అతడిపై చాలా కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. 2021 మే నెలలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో 8 మంది స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, కానీ హరి అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటి నుండే హరికి చాలా మంది స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అల్లు అర్జున్ (AlluArjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' (Pushpa) సినిమా కూడా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో వచ్చిన సినిమానే. ఆ మాదిరిగానే హరి చాలాసార్లు ఎర్ర చందనం ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తరలించడానికి బాగా ప్రయత్నాలు చేసేవాడని కూడా తెలిసింది.

Updated Date - 2023-06-13T13:12:57+05:30 IST