Mahesh Babu: అది సిగరెట్ కాదు, బీడీ

ABN, First Publish Date - 2023-03-27T11:49:51+05:30

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో చాలా సంవత్సరాల తరువాత మహేష్ పొగ తాగాడు, అది కూడా సిగరెట్ కాదు, బీడీ

Mahesh Babu: అది సిగరెట్ కాదు, బీడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అని అధికారికంగా చెప్పారు. ఎప్పుడో మొదలెట్టి ఈపాటికి విడుదల అవ్వాల్సిన సినిమా అనేక కారణాలతో వచ్చే సంవత్సరానికి మొత్తానికి విడుదల తేదీ ఖరారు చేశారు. పరిశ్రమలో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది, ఎందుకు అంత లేట్ గా విడుదల చేస్తున్నారు అని. అంతవరకు ఏమి చేస్తారు. సినిమా షూటింగ్ మొదలయింది, కానీ షూటింగ్ కి ఒక సంవత్సరం తీసుకుంటారా.

ఈ సినిమా మొదలెట్టే ముందే ఈసారి త్రివిక్రమ్ చాలా తొందరగా సినిమా పూర్తి చేయనున్నాడు అని వార్తలు చాలా వచ్చాయి కాదా, మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని నెలలు తీసుకుంటున్నాడు అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. విడుదల తేదీలు లేవా, లేక మహేష్ బాబు సంక్రాంతి సెంటిమెంట్ (Sankranthi sentiment) అని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేద్దాం అని చెప్పాడా, ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు అన్నదే పరిశ్రమలో అనుకుంటున్నారు.

maheshbabutrivikramfilm.jpg

ఇక మహేష్ బాబు లుక్ చూస్తే అందులో మహేష్ బాబు సిగరెట్ కాదు, బీడీ కలుస్తున్నాడు. ఇదేంటి వెరైటీ గా వుంది కదూ అని అనుకుంటే, సినిమాలో ఆ బీడీ కాల్చటం లో కూడా చాల వెరైటీ లు చూపిస్తాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. బీడీ నోట్లోంచి తీస్తాడట మహేష్ బాబు ఒక్కో సారి. అలాగే బీడీ కలుస్తూ, లుంగీ పంచతో కూడా కనపడతాడు అని చెప్తున్నారు. శ్రీ లీల (Sreeleela), మహేష్ బాబు సన్నివేశాలు సినిమాలో చాలా హైలైట్ గా వుంటాయని కూడా చెప్తున్నారు. పూజ హెగ్డే (Pooja Hegde) కూడా ఒక కథానాయికగా నటిస్తోంది.

Updated Date - 2023-03-27T11:49:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!