కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇచ్చింది
ABN, First Publish Date - 2023-02-22T00:38:36+05:30
‘‘వినరో భాగ్యం విష్ణు కథ’ చిత్రం ఫలితం ఆనందాన్నిచ్చింది. నా గత చిత్రాలన్నింటిలోకన్నా చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది.....
‘‘వినరో భాగ్యం విష్ణు కథ’ చిత్రం ఫలితం ఆనందాన్నిచ్చింది. నా గత చిత్రాలన్నింటిలోకన్నా చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కొత్త దర్శకులకు ధైర్యం ఇవ్వాలని చేసిన సినిమా ఇది. మా దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు సినిమాను తీర్చిదిద్దిన విధానం నాకు బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకారం అందించారు’ అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్దేశి జంటగా తెరకెక్కిన ‘వినరో భాగ్యం...’ చిత్రం ఇటీవలె విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. బన్నీవాసు మాట్లాడుతూ ‘అరవింద్ గారి క్రమశిక్షణ, మా టీం కష్టం వల్లే ఇంత పెద్ద సక్సెస్ వచ్చింద’ని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. కుటుంబంతో కలసి చూసే సినిమా ఇది’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందులో అమ్మ సెంటి మెంట్ ఉంది. ఆడపిల్ల బాధపడితే విష్ణు ఏం చేస్తాడో చెప్పే కథ ఇది’ అని తెలిపారు.