IT Rides -Target Heros: ఐటీ అధికారుల చేతిలో హీరోల గుట్టు

ABN , First Publish Date - 2023-04-25T16:38:23+05:30 IST

వారంరోజులుగా ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీస్‌ (Mythri movie makers) సంస్థపై ఐటీ శాఖ దాడులకు సంబంధించిన వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే!

IT Rides -Target Heros: ఐటీ అధికారుల చేతిలో హీరోల గుట్టు

వారంరోజులుగా ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీస్‌ (Mythri movie makers) సంస్థపై ఐటీ శాఖ దాడులకు సంబంధించిన వార్తలు హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! అంతే కాదు దర్శకుడు సుకుమార్‌ ఇల్లు, ఆఫీస్‌లోనూ సోదాలు జరిగాయి. సోమవారంతో ఐటీ సోదాల ప్రక్రియ ముగిసింది. ఈ తనిఖీలో ఐటీ శాఖకు కొన్ని కీలకమైన ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఆ సంస్థ నిర్మించే చిత్రాల్లో నటిస్తున్న హీరోలకు సంబంధించిన పారితోషికాలకు సంబంధించిన సమాచారాన్ని ఐటీ అధాకారులు సేకరించారని తెలిసింది. హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్‌ బ్లాక్‌, వైట్‌లో (Black money) ఉంటుంది. నిర్మాతలు ఇచ్చే పారితోషికం మొత్తం వైట్‌లో చూపించరు. దాని వల్ల హీరోలు టాక్స్‌ కట్టే భారం కాస్త తగ్గుతుంది. (Target Star heros)

ప్రస్తుతం మైత్రీ మూవీస్‌ సంస్థ చేసే చిత్రాలన్నీ అగ్ర హీరోలతోనే. ఇప్పుడు టాలీవుడ్‌ అగ్ర హీరోల పారితోషికం రూ. 50 కోట్లకు పైబడే! మైత్రీ సంస్థ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు కాకుండా ప్రభాస్‌తో ఓ భారీ చిత్రం చేయనుంది. బాలీవుడ్‌ దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ దీనికి దర్శకుడు. ఇప్పటికే ప్రభాస్‌ సహా కీలకమైన సాంకేతిక నిపుణులకు మైత్రీ సంస్థ అడ్వాన్స్‌ ఇచ్చిందని టాక్‌. ఇప్పుడు ఆ వివరాలు ఐటీ అధికారులు చేతిలో ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌తో పాటు మైత్రీలో పని చేస్తున్న హీరోలకు ఎంత పారితోషికం ఇచ్చారు. అందులో వైట్‌ ఎంత, బ్లాక్‌ ఎంత అన్న విషయాలను ఐటీ రాబట్టింది. ఇప్పుడు ఐటీ అధికారులు టార్గెట్‌గా హీరోలే (Target Tollywood Heros) అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-04-25T16:38:23+05:30 IST