Shivani Rajasekhar: ఉప్పెన నేను చేయాల్సింది.. ఆ సీన్లు ఉన్నాయ‌ని!

ABN , First Publish Date - 2023-11-26T18:41:19+05:30 IST

తెలుగునాట ఉప్పైన సినిమా సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న‌ది.

Shivani Rajasekhar: ఉప్పెన నేను చేయాల్సింది.. ఆ సీన్లు ఉన్నాయ‌ని!
shivani, uppena

తెలుగునాట ఉప్పైన (Uppena) సినిమా సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అంతా కొత్త‌వారితో చిన్న బ‌డ్జెట్‌తో వ‌చ్చిన ఈ సినిమా ఏకంగా రూ.100కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాసింది. ఆ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో క‌థానాయిక‌గా చేసిన కృతిశెట్టి ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారి తెలుగులో వరుసగా ఆర డ‌జ‌న్‌కు పైగా సినిమాలకు సైన్ చేసి బిజీయెస్ట్ స్టార్‌గా మారింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌య‌ట‌కు వ‌చ్చి సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్న‌ది. శివానీ రాజ‌శేఖ‌ర్ (Shivani Rajasekhar) ఇప్పుడిప్పుడే తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న‌ది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల విడుద‌లైన కోట‌బొమ్మాళీ పీఎస్‌లో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సంద‌ర్బంగా శివానీ ఓ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్న‌ది.


ఉప్పెన(Uppena) సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట‌ నాకే అవ‌కాశం వ‌చ్చింద‌ని, కానీ నాకు వినిపిచ్చిన స్క్రిప్టులో ఇంటిమేట్, బోల్డ్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో నేను నో చెప్పాన‌ని, తీరా సినిమా విడుద‌ల అనంత‌రం చూస్తే నాకు చెప్పిన క‌థ అందులో ఉన్నది చాలా మార్పులు చేశార‌ని చెప్పుకొచ్చింది. ఆ ఫైన‌ల్ వ‌ర్ష‌న్ నాకు చెబితే నేను చేసే దానినేమోన‌ని మంచి అవ‌కాశం మిస్స‌య్యాను అంటూ బాధ ప‌డింది.

Updated Date - 2023-11-26T18:42:50+05:30 IST