Indian 2: సిద్ధార్థ్‌కు శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2023-04-17T16:53:23+05:30 IST

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఇండియన్‌’ (భారతీయుడు) చిత్రానికి కొనసాగింపుతు ఇండియన్‌-2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే!

Indian 2: సిద్ధార్థ్‌కు శుభాకాంక్షలు!

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamalhaasan) హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన ‘ఇండియన్‌’ (భారతీయుడు) చిత్రానికి కొనసాగింపుతు ఇండియన్‌-2 (Indian 2) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! అప్పట్లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని 27 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ చేస్తున్నారు శంకర్‌ (shankar). ఈ చిత్రం మొదలై ఇప్పటికే నాలుగేళ్లు పూర్తికావొస్తుంది. కరోనా లాంటి కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం షూటింగ్‌ మళ్లీ గాడిలో పడింది. రెండు నెలల క్రితం తిరుపతిలో ఓ షెడ్యూల్‌ చేశారు. ఇటీవల తైవాన్‌లో యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి చేశారు శంకర్‌. తదుపరి సౌత్‌ ఆఫ్రికాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. అక్కడ ట్రైన్‌ సెట్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రం గురించి శంకర్‌ ఆసక్తికర అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఆయనకు శుభాకాంక్షలు చెబుతు కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. బుల్లెట్‌పై కూర్చుని ఉన్న సిద్ధార్థ్‌ (Siddarth)లుక్‌ ఆకట్టుకుంటోంది. (Hbd Siddarth)

1996లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్‌-2’ తెలుగులో భారతీయుడు టైటిల్‌తో విడుదలైంది. ఆ చిత్రం ఎంతగా విజయవంతంమైందో తెలిసిందే. ఇప్పుడు ఇండియన్‌-2 చిత్రం కోసం కూడా అభిమానులు ఎంత ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాయుకలు. ప్రియా భవానీ శంకర్‌.. సముద్రఖని.. బాబీ సింహా ఇతర పాత్రధారులు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-04-17T16:53:24+05:30 IST