Pilot Comments on Baby : కన్నీళ్లు పెట్టించారు బ్రో.. అంటూ టిష్యూపై లేఖ!

ABN , First Publish Date - 2023-11-23T19:49:46+05:30 IST

బేబీ’ (Baby)సినిమా చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఆ సినిమాతో ఆనంద్‌ (Anand Devarakonda) తన మనసు గెలుచుకున్నాడని ఇండిగో పైలట్‌ (Indigo pilot) మాటలకు ఆనంద్‌ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు.

Pilot Comments on Baby : కన్నీళ్లు పెట్టించారు బ్రో.. అంటూ టిష్యూపై లేఖ!

‘బేబీ’ (Baby)సినిమా చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఆ సినిమాతో ఆనంద్‌ (Anand Devarakonda) తన మనసు గెలుచుకున్నాడని ఇండిగో పైలట్‌ (Indigo pilot) మాటలకు ఆనంద్‌ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు.

నటుడు ఆనంద్‌ దేవరకొండ తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఇండిగో పైలట్‌ సుభాష్‌ ఆనంద్‌ వర్క్‌ను మెచ్చుకుంటూ టిష్యూపై లేఖ రాసి అందించాడు. ‘బేబీ’ చిత్రం చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని.. ఆ సినిమాతో ఆనంద్‌ తన మనసు గెలుచుకున్నాడని సుభాష్‌ ఆ లేఖలో పేర్కొన్నాడు. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి చిత్రాల్లో నటించమని కోరాడు. అలాగే, విజయ్‌ దేవరకొండకు హాయ్‌ చెప్పమన్నాడు. ఈ లేఖపై ఆనంద్‌ దేవరకొండ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయ్‌ సోషల్‌ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. సుభాష్‌ ననా డేను ఎంతో ప్రత్యేకంగా మార్చారు. మన వర్క్‌ను ఎదుటివ్యక్తులు గుర్తించి ప్రశంసిస్తే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేమని ఆయన అన్నారు. కెరీర్‌ పరంగా తాను ఎన్నో సాధించాలని, అదే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని విజయ్‌ చెప్పారు.

ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్‌. ప్రస్తుతం ఆయన ‘గం గం గణేశా’లో నటిస్తున్నారు. ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకుడు. దీనితోపాటు వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఆయన మరో సినిమా ఓకే చేశారు.

Updated Date - 2023-11-23T19:55:09+05:30 IST