Kamalhassan - Shankar: తిరుపతిలో ఇండియన్ 2

ABN , First Publish Date - 2023-01-21T13:00:29+05:30 IST

కమల్‌హాసన్‌- అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ‘భారతీయుడు 2’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kamalhassan - Shankar: తిరుపతిలో ఇండియన్ 2

కమల్‌హాసన్‌(kamal hassan)- అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar)దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’(Indian 2). ‘భారతీయుడు 2’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్‌ అగర్వాల్‌(kajal), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికలు. సిద్థార్థ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొంతగ్యాప్‌ తర్వాత చిత్రం షూటింగ్‌ ఊపందుకుంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఆదివారం నుంచి తిరుపతి (indian 2 shooting in tirupati) పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ఆ పనుల్లో బిజీగా ఉంది. శంకర్‌ ప్రస్తుతం భారతీయుడు -‘2, రామ్‌చరణ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. భారతీయుడు 2 చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. అనిరుధ్ధ్‌ రవిచంద్రన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు. .

Updated Date - 2023-01-21T13:00:30+05:30 IST