Indian 2: తైవాన్‌లో శంకర్‌ సేన..!

ABN , First Publish Date - 2023-04-03T11:30:42+05:30 IST

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan), క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ (shankar)కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే!

Indian 2: తైవాన్‌లో శంకర్‌ సేన..!

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌(Kamal Haasan), క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ (shankar)కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! సేనాపతిగా కమల్‌ నటన ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు 26 ఏళ్ల తర్వాత సేనాపతి పాత్రకు కొనసాగింపు ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతుంది. ఈ చిత్రం ప్రారంభమై చాలాకాలం కావొస్తుంది. కరోనా, పలు సమస్యలతో షూటింగ్‌లో జాప్యం జరిగింది. కొంతగ్యాప్‌ తర్వాత శంకర్‌ మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టారు. చెన్నై, తిరుపతి ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా శంకర్‌ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. రామ్‌చరణ్‌తో చేస్తున్న ‘గేమ్‌ చేంజర్‌’కు కొంత గ్యాప్‌ ఇచ్చి ‘ఇండియన్‌ 2 లేటెస్ట్‌ షెడ్యూల్‌ను శంకర్‌ (shooting at Thaiwan) షురూ చేశారు. తైవాన్‌లో ‘ఇండియన్‌ 2 లేటెస్ట్‌ షెడ్యూల్‌ మొదలైంది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. తైవాన్‌ లొకేషన్‌లో ఉన్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు.

5.jpg

అయిదేళ్ల క్రితం తైవాన్‌లోనే (actions scenes in Thaiwan) ఈ సినిమా షూటింగ్‌ మొదలైన సంగతి తెలిసిందే! కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పుడు వేగవంతమైంది. జూన్‌ నాటికి షూటింగ్‌ పూర్తి చేసేందుకు శంకర్‌ కృషి చేస్తున్నారు. తైవాన్‌లో వారం రోజులపాటు ఈ షెడ్యూల్‌ చేసి తర్వాతి షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌ ప్లాన్‌ చేశారట. తర్వాత జరిగే 25 రోజుల షెడ్యూల్‌లో ఒక ట్రైన్‌లో భారీ యాక్షన్‌ బ్లాక్‌ని షూట్‌ చెయ్యనున్నారు శంకర్‌. ఈ షెడ్యూల్‌ దక్షిణాఫ్రికాలో జరగనుంది. దీనికి హాలీవుడ్‌ యాక్షన్‌ టీమ్‌ పని చేయనున్నారు. ఈ యాక్షన్‌ పార్ట్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజల్‌, రకుల్‌ కథానాయికలుగా నటిస్త్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌, అనిరుద్‌ సంగీత దర్శకులు.

Updated Date - 2023-04-03T11:31:49+05:30 IST