Inaya Sultana : అప్పుడు బాడీ సహకరించదు.. అందుకే ఇప్పుడే..!

ABN , First Publish Date - 2023-11-09T14:47:21+05:30 IST

ఇనయా సుల్తానా..(inaya sultana) ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రైవేట్‌ పార్టీ వీడియోతో పాపులర్‌ అయింది. సోషల్‌ మీడియాలో హాట్‌హాట్‌ ఫొటోలతో దర్శనమిస్తూ ఇంకొంచెం పాపులర్‌ అయింది. తర్వాత సినిమాల్లో చిన్నచితక అవకాశాలు అందుకుంది

Inaya Sultana :  అప్పుడు బాడీ సహకరించదు.. అందుకే ఇప్పుడే..!

ఇనయా సుల్తానా..(inaya sultana) ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రైవేట్‌ పార్టీ వీడియోతో పాపులర్‌ అయింది. సోషల్‌ మీడియాలో హాట్‌హాట్‌ ఫొటోలతో దర్శనమిస్తూ ఇంకొంచెం పాపులర్‌ అయింది. తర్వాత సినిమాల్లో చిన్నచితక అవకాశాలు అందుకుంది. ఆర్‌జీవీ వీడియో, సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌తో బిగ్‌బాస్‌ సీజన్ - 6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తన ఆట తీరు, ముక్కుసూటితనంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక అవకాశాలు వరుస కడతాయని ఆశించింది. అయితే సరైన అవకాశం ఒకటీ రాలేదు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగింది. కానీ కాలం కలిసి కాలేదు. ఏ నిర్మాణ సంస్థ కనికరించలేదు. ఇదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. శ్రీలీలా, కృతి శెట్టిలా తాను కూడా 16.. 17 ఏళ్ల వయస్సుకే ఇండస్ర్టీలోకి వచ్చి ఉంటే ఇంకోలా ఉండేదేమో.. ఏడేళ్లు వేస్ట్‌ చేసుకున్నా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. (Biggboss Fame)

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ "అవకాశాలు రాలేదని నిరూత్సహపడలేదు. వెనకపడుతున్నాననే బాధ ఉన్నా అది బయటకు కనిపించకుండా ఉంటాను. ఉన్నంతలో హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలు టీనేజ్‌లోనే స్టార్‌ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. 16, 17 ఏళ్ల అమ్మాయిలు స్టార్స్‌గా ఎదుగుతున్నారు. కృతిశెట్టి, శ్రీలీల సైతం ఆ వయసులో వచ్చారు. నేను 22 ఏళ్లకు ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. వాళ్లతో కంపేర్‌ చేస్తే నేను 7 ఏళ్లు వృధా చేసుకున్నాను. అంత ఆలస్యం  చేయకుండా వాళ్లకులాగా ముందే వచ్చి ఉంటే లైఫ్‌ ఇంకోలా ఉండేదేమో! అయినా వాటి గురించి పెద్దగా ఆలోచించను. సమయం వృధా చేసుకోను. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ సమయంలో 60 ఏళ్లు బతకడమే కష్టం. ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నా ఏజ్‌ 25. మహా అయితే మరో 25 ఏళ్లు బతుకుతాను. నేను ఎంజాయ్‌ చేసేది మాగ్జిమమ్‌ 10 - 15 ఏళ్లు మాత్రమే! ఆ తర్వాత ఎంజాయ్‌ చేద్దామంటే బాడీ కూడా సహకరించదు. ఇప్పుడు నా దగ్గర టైమ్‌ ఉంది. అందుకే ఖాళీగా ఉన్న టైమ్‌ను నా పర్సనల్‌ లైఫ్‌ హ్యాపీగా ఉంచుకోవడం కోసం ఉపయోగిస్తాను. ఇక సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు శాంపిల్‌ మాత్రమే. ఇంకా నా ఇద్దర మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయి. అవన్నీ పోస్ట్‌ చేస్తే ఏమైపోతారో’’ అని అంది.

Inaya.jpg

ఇక అవకాశాల గురించి చెబుతూ "అటు బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక మంచి అవకాశాలు వస్తయేమో అని భావించా. ఎన్నో ప్రయత్నాలు చేశా. కానీ ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు. అలాగని ఇంట్లో కూర్చుని  డిప్రెషన్ లోకి వెళ్లలేదు. నా బాడీ, బ్యూటీ మీద వర్క్‌ చేశాను. సెల్ఫ్‌ హ్యాపీ నెస్‌ కోసం పని చేశాను. ఈ జర్నీలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అయినా కుంగిపోలేదు. బిగ్‌ బాస్‌ నుంచి వచ్చాక అవకాశాల కోసం చాలా ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. సినిమాల్లో స్థిరపడాలనే కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అడుక్కున్నట్లుగానే అవకాశాలు అడుక్కున్నాను. అయినా ఫలితం లేదు. కాస్త ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి’’ అని తెలిపింది.

Updated Date - 2023-11-09T14:50:20+05:30 IST