Ileana D'Cruz: పుట్టబోయేది ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2023-05-26T15:58:47+05:30 IST

నేను గర్భవతిని, పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నానంటూ.. గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే!

Ileana D'Cruz: పుట్టబోయేది ఎవరో తెలుసా?

"నేను గర్భవతిని, పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నానంటూ" గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే! తన తల్లి కూడా ‘నేను కూడా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా’ అంటూ కామెంట్‌ చేశారు. బేబీ బంప్‌తో (Baby bump) ఉన్న ఫోటోలను పంచుకోవడంతో అభిమానులు షాకయ్యారు. పెళ్లి కాకుండా గర్భం దాల్చడంతో పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ కొందరు నెటిజన్స్‌ ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా బేబీ బంప్‌తో ఉన్న ఇలియానా కారులో వెళ్తున్న వీడియో షేర్‌ చేసి ‘సన్‌ అవుట్‌, బంప్స్‌ అవుట్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. తాజాగా మరోసారి బేబీ బంప్స్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఏంజెల్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. పుట్టబోయేది ఆడబిడ్డే అన్నట్లు హింట్‌ ఇచ్చింది ఇల్లీబేబీ. (Ileana D'Cruz)

గతంలో ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా ప్రేమలో పడింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 2019లో ఈ జంట విడిపోయారు. అప్పట్నుంచీ ఆమె సింగిల్‌గానే ఉంటోంది. తర్వాత కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇలియానా ఎక్కడే ప్రస్తావించలేదు. తన లైఫ్‌ పార్టనర్‌ ఎవరనేది చెప్పాలేదు. టాలీవుడ్‌లో సక్సెస్‌లు లేకపోవడం, అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌ బాట పట్టింది ఇలియానా. అక్కడ కొన్ని విజయాలు అందుకున్నా కొన్ని చిత్రాలు మాత్రం నిరాశను మిగిల్చాయి.

Updated Date - 2023-05-26T16:04:55+05:30 IST