Ileana : తల్లి కాబోతున్న ఇలియానా.. నిజమేనా!

ABN , First Publish Date - 2023-04-18T12:13:55+05:30 IST

గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) తల్లి కాబోతుందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌లో ఉన్న ఆంతర్యమేంటి? ప్రస్తుతం నెట్టంట జరుగుతున్న చర్చ ఇది. తాజాగా ఇలియానా సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌ హల్‌చల్‌ చేస్తోంది.

Ileana  : తల్లి కాబోతున్న ఇలియానా.. నిజమేనా!

గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) తల్లి కాబోతుందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌లో ఉన్న ఆంతర్యమేంటి? ప్రస్తుతం నెట్టంట జరుగుతున్న చర్చ ఇది. తాజాగా ఇలియానా సోషల్‌ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌ హల్‌చల్‌ చేస్తోంది. తాను తల్లి కాబోతున్నట్లు అర్థం వచ్చేలా ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌ను ఫాలో అయిన ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. (Ileana D'Cruz Becomes mother)

ఆమె షేర్‌ చేసిన మొదటి ఫొటోలో ‘అడ్వెంచర్‌ బిగిన్స్‌’ అని రాసున్న చిన్న పిల్లాడి టీషర్ట్‌ ఉంది. రెండో ఫొటోలో ‘మమ్మ’ అని రాసిన లాకెట్‌ ఉంది. దీనికి క్యాప్షన్‌గా ‘‘నా లిటిల్‌ డార్లింగ్‌ను చూసేందుకు ఆత్రుతగా (Ileana post Viral) ఎదురుచూస్తున్నాను. కమింగ్‌ సూన్‌’’ అని రాశారు. ఇలియానా పోస్ట్‌కు ఆమె తల్లి కామెంట్‌ చేశారు. ‘గ్రాండ్‌ వెల్‌కమ్‌ టూ మై గ్రాండ్‌ బేబీ’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ చూసిన నిషా అగర్వాల్‌, అతియాశెట్టి, నర్గీస్‌ ఫక్రీ తదితరులు ఇలియానాకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. మరికొందరైతే ‘అసలు ఇలియానాకు పెళ్లి ఎప్పుడు జరిగిది.., ఫ్యామిలీ ఫొటో షేర్‌ చేయండి’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మూడేళ్ల క్రితం ఇలియానా అండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే! ఇద్దరూ కలిసి ఆల్మోస్ట్‌ లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నట్లే పల్లు సందర్భాల్లో వార్తలొచ్చాయి. కొంతకాలానికి బ్రేకప్‌ అయింది. అప్పటి నుంచి ఇల్లీబేబీ సింగిల్‌గానే ఉన్నారు. మరి పెళ్లి కానీ ఇలియానా గర్భవతి ఎలా అయ్యారు? సరోగసీకి వెళ్లారా? లేక ఎవరిరైనా అడాప్ట్‌ చేసుకోబోతున్నారా? అన్న ప్రశ్నలు వెలులవెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే!

తన కెరీర్‌ మొదలైన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇలియానాకు అవకాశాలు లేవు. 2018లో రవితేజ హీరోగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంలో నటించింది. తర్వాత హిందీ సినిమాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అప్పుడప్పుడూ మ్యూజిక్‌ వీడియోల్లోనూ మెరుస్తున్నారు ఇలియానా. తాజా సబ్‌ గజాబ్‌ వీడియోతో ఇల్లీబేబీ అలరించారు.

Updated Date - 2023-04-18T13:02:33+05:30 IST