సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nandamuri Balakrishna: నాకు ఆయనతో సినిమా చేయాలని వుంది

ABN, First Publish Date - 2023-04-19T11:05:44+05:30

అగ్ర నటులు అందరితో ఇటు తెలుగు అటు తమిళం లో నటించిన ఖుష్బూ ఒక్క నటుడితో మాత్రం చెయ్యలేదుట. ఇంతకీ ఆ నటుడు ఎవరు, ఎందుకు చెయ్యలేకపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్ నటి ఖుష్బూ (Khushbu) మళ్ళీ ఇంకో తెలుగు సినిమా 'రామ బాణం' (Rama Banam) తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి శ్రీవాస్ (Sriwaas) దర్శకుడు కాగా, గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇంకో సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) కూడా ఇందులో వున్నాడు, అతిని పక్కన ఖుష్బూ వేస్తోంది. ఇందులో ఖుష్బూ పాత్ర చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అందరూ. ఆమె ఒక చిన్న సందేశం కూడా ఇస్తుంది తన పాత్ర ద్వారా అని కూడా అంటున్నారు.

ఆ సినిమా గురించి ఖుష్బూ మాట్లాడుతూ ఇందులో తన పాత్ర ఇప్పటి ఆహార అలవాట్లు, అప్పట్లో ఎలా ఉండేవి అనే దాని మీద మాట్లాడుతుందని చెప్పింది. అలాగే ఆమె అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కి ఎంత పెద్ద అభిమాని అని కూడా చెపుతూ, అతని పోస్టర్స్ ని తన బెడ్ రూమ్ లో వుంచుకున్నాను అని కూడా చెప్పింది ఖుష్బూ.

అయితే ఖుష్బూ అప్పట్లో అందరి అగ్రనటుల పక్కన నటించింది, కానీ ఒక్కరితో మాత్రం చెయ్యలేదుట. అది మరెవరో కాదు, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అంట. తెలుగులో ఇంకా ఎవరితో సినిమాలు చేయాలని ఉంది అని అడిగిన ప్రశ్నకు, "ఇప్పటిదాకా బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు. ఆయన తో సినిమా చేయాలని ఉంది", అని చెప్పింది. బాలకృష్ణ తో చేసే దర్శకులు ఇప్పుడు ఖుష్బూ మాట వింటే రాబోయే సినిమాల్లో కచ్చితంగా ఖుష్బూ ని తీసుకోవడానికి చూస్తారేమో.

అలాగే ఖుష్బూ ఇప్పుడు వెండితెర మీదే కాకుండా, బుల్లి తెర మీద కూడా కనిపిస్తోంది. అదే విషయం ఆమెని అడిగితే, సినిమాలో దర్శకుడు రూపొందించిన పాత్రకి తగ్గట్లుగా నటించాల్సి ఉంటుంది. కానీ టీవీ షోలు అలా కాదు. నేను నాలాగా ఉండొచ్చు అని చెప్తోంది ఖుష్బూ.

Updated Date - 2023-04-19T11:05:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!