Thammareddy Bharadwaj: సంస్కారంతో పెంచారు నా తల్లిదండ్రులు, అందుకే నీలాగ బూతులు మాట్లాడలేను...

ABN , First Publish Date - 2023-03-10T18:06:52+05:30 IST

అంటూ నాగబాబు కి కౌంటర్ ఇచ్చారు తమ్మారెడ్డి. మూడు గంటల పాటు చిన్న సినిమాకి సంబదించిన ఒక సమీక్షలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఫ్లో లో అన్న మాటలను పట్టుకొని మీరు వైరల్ అవ్వాలనుకుంటే నేను ఏమీ చెయ్యలేను. కానీ మీరు వాడిన బాషకు మాత్రం చాలా బాధ పడ్డాను అని అన్నారు తమ్మారెడ్డి

Thammareddy Bharadwaj: సంస్కారంతో పెంచారు నా తల్లిదండ్రులు, అందుకే నీలాగ బూతులు మాట్లాడలేను...

ఎవరయినా ఏదైనా కామెంట్ చేస్తే, దాన్ని నిజంగా విమర్శించాలి అనుకుంటే విమర్శ చేయొచ్చు, కానీ విమర్శ కూడా మంచి భాషలో చెప్పాలి, అంతే కానీ విమర్శించే వాడు కూడా సరిఅయిన బాష వాడనప్పుడు అతన్ని కూడా అందరూ తప్పు పడతారు. ఇప్పుడు నాగబాబు విషయం లో అదే జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ (Thammareddy Bharadwaj) 'ఆర్.ఆర్.ఆర్' (RRR) మీద చేసిన కామెంట్ మీద నాగబాబు (Nagababu) విమర్శ చేయొచ్చు, కానీ 'నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా రా ఆస్కార్ కోసం' అని ట్వీట్ చెయ్యడం ఏమాత్రం బాగోలేదని చిత్ర పరిశ్రమలో చాలామంది అంటున్నారు. పేరు చెప్పడం ఇష్టం లేని చాలామంది పరిశ్రమలో తమ్మారెడ్డి 'ఆర్.ఆర్.ఆర్' మీద చేసిన వ్యాఖ్య కన్నా, నాగబాబు ఇలా తమ్మారెడ్డి ని విమర్శించటం తప్పు అని అంటున్నారు.

nagababu.jpg

ఇది మొదటిసారి కాదు నాగబాబు ఇలా మాట్లాడటం. గతంలో మా ఎన్నికలప్పుడు కూడా సీనియర్ నటుడు అయిన కోట శ్రీనివాస రావు ని, 'ఒరేయి' అని, గౌరవం లేకుండా పదప్రయోగం చేసి కోట గారిని సంభోదించటం లాంటివి చేసాడు నాగబాబు. మరి నాగబాబు కి సంస్కారం లేదా, ఎవరు నేర్పలేదా అని అడుగుతున్నారు పరిశ్రమలో. చిరంజీవి తమ్ముడు అని పరిశ్రమలో ఎవరూ మాట్లాడరు కానీ, లేకపోతే నాగబాబు అనే అతన్ని ఎవరు పట్టించుకుంటారు అని కూడా అడుగుతున్నారు.

అందుకే తమ్మారెడ్డి కూడా నీకేమి అర్హత వుంది నన్ను విమర్శించటానికి అని అడిగారు. "నాకు నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కాబట్టి నేను నువ్వన్న మాటలకు తిరిగి అదే మాటలతో సమాధానం చెప్పటం లేదు. నేను బూతులు మాట్లాడగలను, కానీ నన్ను నా తల్లిదండ్రులు ఆలా పెంచలేదు" అని చెప్పారు తమ్మారెడ్డి. ఈ ఒక్క సమాధానం తో నాగబాబు కి అర్థం అయి ఉంటుంది అతను ఎలాంటి భాష వాడాడో. తమ్మారెడ్డి కి నోటిని అదుపులో ఉంచుకో, అన్న నాగబాబు నోటి నుండి ఇలాంటి బూతు పదాలు ఎలా వచ్చాయి అని కూడా పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

చిరంజీవికి (Chiranjeevi) పద్మభూషణ్ వచ్చినప్పుడు అతన్ని సన్మానించడానికి పరిశ్రమనుండి ఒక కమిటీ వేసినప్పుడు దానికి తమ్మారెడ్డి భరద్వాజ్ చైర్మన్ గా వున్నారు. అతనే దగ్గరుండి కొన్ని రోజులపాటు అహర్నిశలు పనిచేసి ఒక స్టేడియం లో ఏర్పాటు చేసిన ఈ వేడుకని విజయవంతంగా పూర్తి చేశారు. అలాగే చిరంజీవి కరోనా టైం లో 'CCC' ని స్టార్ట్ చేసినప్పుడు, తమ్మారెడ్డి దానికి కూడా పని చేశారు కదా అని కొందరు పరిశ్రమలో నాగబాబు ని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-03-10T18:07:44+05:30 IST