Sree leela: తొమ్మిదో తరగతిలోనే మొదలెట్టా

ABN , First Publish Date - 2023-06-11T10:49:38+05:30 IST

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరంటే... రెండో ఆలోచన లేకుండా అందరినోటా పలికే పేరు... శ్రీలీల. సీనియర్‌, యంగ్‌ హీరోలు అన్న తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’గా మారింది. ఇంతకీ ఈ బిజీయెస్ట్‌ బ్యూటీ తన గురించి ఏం చెబుతోందంటే...

Sree leela: తొమ్మిదో తరగతిలోనే మొదలెట్టా

టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్‌

వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరంటే... రెండో ఆలోచన

లేకుండా అందరినోటా పలికే పేరు... శ్రీలీల. (Sree leela)

సీనియర్‌, యంగ్‌ హీరోలు అన్న తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’గా

మారింది. ఇంతకీ ఈ బిజీయెస్ట్‌ బ్యూటీ

తన గురించి ఏం చెబుతోందంటే... (Actres Sree leela)

తాతయ్యకు మాటిచ్చాను (actor come Doctor)

నేను ఎల్‌కేజీలో ఉన్నప్పుడనుకుంటా... ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావ్‌ అని అడిగితే.. ‘డాక్టర్‌ అవుతాన’ని చెప్పేదాన్ని. నన్ను వైద్యురాలిగా చూడాలనేది మా అమ్మమ్మ, తాతయ్యల కల. సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నా చదువు పాడవుతుందేమోనని వాళ్లు భయపడ్డారు. ‘నేను కచ్చితంగా డాక్టర్‌ అయితీరుతాన’ని తాతయ్యకి మాటిచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా నా వెంట పుస్తకాలు ఉండాల్సిందే. పరీక్షలు దగ్గరపడితే.. పగలంతా షూటింగ్‌లో పాల్గొని, రాత్రంతా పుస్తకాలు తిరగేస్తుంటా.

వర్కవుట్స్‌ నచ్చవు

నాకు వర్కవుట్స్‌ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. కేవలం యోగా మాత్రమే చేస్తా. అది నాలో పాజిటివ్‌ ఎనర్జీని నింపుతుంది. యోగా రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండడమే గాక, ఆలోచన శక్తి మెరుగుపడుతుంది. దాంతో రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండొచ్చు. స్విమ్మింగ్‌, డ్యాన్స్‌ కూడా నా దినచర్యలో భాగమే.

ఫేస్‌బుక్‌లో చూసి...

అసలు సినిమాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు ఇద్దరు అన్నయ్యలు. అమ్మ ప్రతీ ఏడాది మా ముగ్గురికి ఫొటో షూట్‌ చేయిస్తుండేది మా ఫ్యామిలీ ఫ్రెండ్‌, ఫొటోగ్రాఫర్‌ భువన్‌తో. ఆయన మా ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తే, ఓ కన్నడ డైరెక్టర్‌ ‘కిస్‌’ సినిమా కోసం నన్ను సంప్రదించారు. అలా సినిమాల్లోకి అడుగుపెట్టా. నిజానికి అప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉన్నా. ఆ సమయంలో నా జుట్టు చాలా పొడుగ్గా, మోకాలు వరకు ఉండేది. కానీ సినిమా కోసం మొత్తం కత్తిరించుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాకు బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూగా సైమా అవార్డు లభించింది.

ఇంట్లో కూడా తెలుగే...

నేను క్లాసికల్‌ డ్యాన్సర్ని. అందుకే నా ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ అయినా క్లియర్‌గా తెలిసిపోతుంది. నేను తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా అమ్మే. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. అమ్మ గైనకాలజిస్ట్‌. 'కేజీఎఫ్‌’ హీరో యష్‌ భార్యకు ప్రసవం పోసింది మా అమ్మే. అలా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అయిపోయాం. ఓసారి అనాథాశ్రమానికి వెళ్లాను. అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న శోభిత, గురు అనే ఇద్దరు పిల్లలను చూసి వాళ్లని దత్తత తీసుకున్నా.

కోపం కాస్త ఎక్కువ

నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు. కొన్నిసార్లు తెలియకుండానే కోపం తన్నుకువచ్చేస్తుంది. పెద్ద ముక్కు ఉన్నవాళ్లు కోపిష్ఠులని అంటారు కదా. అందుకేనేమో నాకూ కోపం ఎక్కువ. నా కోపానికి అమ్మ ఎక్కువసార్లు బలైంది. కోపం చల్లారాక అమ్మను అనవసరంగా తిట్టానని ఏడ్చేస్తుంటా.

అంత్యాక్షరి ఆడుతా...

ఇంట్లో నా ముద్దుపేరు అమ్ములు. అంత్యాక్షరి ఆడడమంటే చాలా ఇష్టం నాకు. పైకి మోడ్రన్‌గా కనిపిస్తాను కానీ కాస్త పాత కాలం మనిషినే. నాకు కాబోయేవాడు కూడా నాలాగే పాత కాలం మనిషై ఉండాలనుకుంటా. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుంకుడుకాయ రసం, మందారాకు తలకు పెట్టుకుంటా. నా బ్యాగ్‌లో ఫోన్‌, ఎయిర్‌పోడ్స్‌, అమ్మవారి కుంకుమ ఎప్పుడూ ఉంటాయి.

రిజెక్ట్‌ చేశా...

‘ధమాకా’ (Dhamaka) దర్శకుడు మొదట ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో ఓ క్యారెక్టర్‌ కోసం నన్ను కలిశారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ సినిమాను ఒప్పుకోలేదు. తరువాత ‘ధమాకా’ కథ నాకు బాగా నచ్చడంతో కేవలం పది నిమిషాల్లోనే ఓకే చెప్పేశా.

Updated Date - 2023-06-11T10:49:38+05:30 IST