Dasara: నానికి ముంబై లో అభిమానులు ఏం చేసారో చూసారా...

ABN , First Publish Date - 2023-03-07T16:46:11+05:30 IST

నాని తన చిత్రం 'దసరా' ప్రచారం కోసం ముంబై డంక్ ఫెస్ట్ లో పాల్గొనడానికి, అలాగే అభిమానులతో హోలీ సంబరాలు చేసుకోవడానికి వచ్చాడు. అతనికి ఎన్నడూ లేనంత విధంగా అభిమానులు...

Dasara: నానికి ముంబై లో అభిమానులు ఏం చేసారో చూసారా...

తెలుగు నటులు అందరూ ఇప్పుడు తమ సినిమాలని అల్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు, ఆ ప్రచారం కోసం కొన్ని రోజులు ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ కి వెళుతున్నారు. అందులో భాగం గానే నాని (Nani) తన రాబోయే సినిమా 'దసరా' (#Dasara) సినిమా ప్రచారం కోసం ముంబై (Mumbai) వెళ్ళాడు. ముందుగానే డంక్ ఫెస్ట్ (Dunk Fest) కి వస్తున్నా అని నాని వీడియో విడుదల చెయ్యడంతో ఈరోజు ముంబై లో నాని కోసం అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.

nani-dasara3.jpg

'దసరా' సినిమాలో నాని పేరు ధరణి (#Dharani). ఇది నల్ల బొగ్గు నేపథ్యంలో సాగే సినిమా. తెలంగాణలోని గోదావరిఖని (Godavarikani) దగ్గర ఒక గ్రామం లో జరిగే కథ. ఈ సినిమాలో నాని మోటుగా కనిపిస్తాడు, అలాగే అతని లుక్ కూడా ఒక చదువులేని వాడిలా వుండే విధంగా విడుదల అయిన టీజర్ లో చూపించారు. ఈ సినిమా మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. అందుకనే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చెయ్యాలని నిర్ణయించుకొని, ఇప్పుడు ముంబై లో ఈరోజు హోలీ (#Holi) సందర్భంగా అక్కడ అభిమానులతో సంబరాలు చేసుకోవాలని ముంబై వచ్చాడు.

nani-dasara1.jpg

ముంబై లో అతనికి విశేష ఆదరణ లభించింది. ఒక తెలుగు నటుడికి ఇంత ఆదరణ లభించటమే అని ఆశ్చర్యపోయే విధంగా అభిమానులు అక్కడ వున్నారు. మొదటి సారిగా నాని ఇక్కడ ముంబై లో తన సినిమా ప్రచారం చెయ్యడం. అక్కడకి వచ్చిన ప్రేక్షకులు నాని కూడా అంతలా ఉంటుందని ఊహించి ఉండదు ఏమో, అంత పెద్ద గా వచ్చారు. ఇందులో కీర్తి సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తోంది, అలాగే శ్రీకాంత్ ఓడెల (Srikanth Odela) దీనికి దర్శకుడు.

ఇది కూడా చదవండి:

*JrNTR: అమెరికాలో అభిమానులతో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు

Updated Date - 2023-03-07T17:58:17+05:30 IST