TarakaRamaRao: ఎన్టీఆర్ కి తెలుగులో విష్ చేసిన హ్రితిక్ రోషన్, ఇంక రచ్చరచ్చే

ABN , First Publish Date - 2023-05-20T11:42:16+05:30 IST

బాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసి విషెస్ చెప్పాడు. త్వరలో కలుసుకుందాం అన్నాడు. ఇది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో చెయ్యబోయే హిందీ సినిమా 'వార్ 2' అధికారికంగా చేస్తున్నట్టు వార్త.

TarakaRamaRao: ఎన్టీఆర్ కి తెలుగులో విష్ చేసిన హ్రితిక్ రోషన్, ఇంక రచ్చరచ్చే
A still from his upcoming film Devara

జూనియర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు ఈరోజు. అతని సినిమా 'దేవర' ఫస్ట్ లుక్ విడుదల అయింది. అతని పాత సినిమా, అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిన 'సింహాద్రి' #Simhadri4K సుమారు 1200 స్క్రీన్ లలో ప్రపంచం అంతటా ఈరోజు విడుదల అయింది. మొత్తం సాంఘీక మాధ్యమాల్లో, ఇంటర్నెట్ లో ఎన్టీఆర్ వైరల్ అవుతున్నాడు. #ManOfMassesNTR తెలుగు చలన చిత్ర సీమ నుండి చాలామంది ప్రముఖులు ఈరోజు ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షురాలు తెలుపుతున్నారు. #NTR30

ntramarao.jpg

ఇవన్నీ ఇలా ఉంటే, బాలీవుడ్ హార్ట్ త్రాబ్ హృతిక్ రోషన్ (HrithikRoshan) కూడా ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. #War2 అదీ కాకుండా అతను తెలుగులో చెప్పడం ఇంకా పెద్ద విశేషం. మన తెలుగు నటుడుకి ఒక అగ్రశ్రేణి హిందీ నటుడు తెలుగులో శుభాకాంక్షలు చెప్పాడు అంటే, ఎన్టీఆర్ పాపులారిటీ ఎంతలా పెరిగిందో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే త్వరలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు త్వరలో ఒక బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. ఇది ఒక యాక్షన్ సినిమా, ఇది ఎన్టీఆర్ కి బాలీవుడ్ డెబ్యూ కూడా అవుతుంది. అయాన్ ముఖర్జీ (AyaanMukherjee) దీనికి దర్శకుడు. #NTR31

ntramarao1.jpg

ఇదిలా ఉండగా, హృతిక్ రోషన్ చేసిన ఈ ట్వీట్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కంఫర్మ్ అయినట్టుగా అందరూ భావించవచ్చు. ఎందుకంటే ఆ ట్వీట్లో త్వరలో కలుసుకుందాం అని అన్నాడు హృతిక్. ఈ ఇద్దరూ 'వార్ 2' #War2 సినిమా చేస్తున్నారు అని ఇప్పుడు ఇది అధికారిక కంఫర్మ్ అనుకోవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ (KoratalaSiva) దర్శకత్వం లో 'దేవర' (Devara) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ కూడా నిన్ననే ప్రకటించారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) విలన్ గా వేస్తున్నాడు.

Updated Date - 2023-05-20T11:42:16+05:30 IST