సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NTR: వెకేషన్ లో వున్నా, ఇది మాత్రం మానటం లేదు !

ABN, First Publish Date - 2023-05-29T15:24:35+05:30

తను ఎక్కడ వున్నా, ఎటు వెళ్లినా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ సినిమా గురించే ఎక్కువ ఆలోచిస్తాడు ఎన్టీఆర్. ఎందుకంటే వెకేషన్ లో వున్నప్పుడు కూడా వ్యాయామం తప్పకుండా చేస్తూ కనిపిస్తున్నాడు. 'దేవర' సినిమా షూటింగ్ మధ్యలో కుటుంబంతో వేసవి విడిది కి వెళ్లిన ఎన్టీఆర్ తొందరగానే తిరిగి వచ్చి షూటింగ్ మొదలెడతాడు అని అంటున్నారు.

NTR from Devara film
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ (NTR) కుటుంబంతో వెకేషన్ కి వెళ్లిన సంగతి, ఆ ఫోటోస్ వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే. దర్శకుడు కొరటాల శివతో (KoratalaSiva) 'దేవర' (Devara) సినిమా చేస్తున్న ఎన్టీఆర్, సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర, ఇంకోటి మోడ్రన్ గా వుండే పాత్ర. శ్రీదేవి (Sridevi) కూతురు జాన్వీ కపూర్ (JanhviKapoor) ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ఇప్పుడు వెకేషన్ లో వున్నా కూడా వ్యాయామం మాత్రం చెయ్యకుండా వుండలేదుట. ప్రతి రోజు జిమ్ చేస్తూ వ్యాయామానికి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని అతని టీము ఒక ఫోటో కూడా విడుదల చేసింది. ఎందుకంటే కొరటాల శివ సినిమాలో ఆ లుక్ సినిమా అంతా ఒకేలా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి.

అందుకనే ఎన్టీఆర్ వెకేషన్ లో వున్నా కూడా వ్యాయామం తప్పకుండా చేస్తున్నాడు. ఇది అతని డెడికేషన్ ని తెలియచేస్తోంది. ఎందుకంటే వెకేషన్ అని సరదాగా తీసుకొని, వ్యాయామం చెయ్యకపోతే, ఫిజిక్ లో తేడాలు వచ్చేస్తాయి. అప్పుడు పాత్రలో చాలా తేడాలు కనిపిస్తాయి. అందుకని ఎన్టీఆర్ తాను ఎక్కడా చిన్న తప్పు కూడా లేకుండా ఉండాలంటే ఎక్కడికి వెళ్లిన, వున్నా ఇవన్నీ తప్పకుండా అనుసరించాలి అని చేస్తున్నాడు అని అంటున్నారు.

Updated Date - 2023-05-29T15:24:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!