Salaar: ఆ వైభవాన్ని చాటి చెప్పేలా ట్రైలర్‌ తీసుకొస్తాం!

ABN , First Publish Date - 2023-07-08T16:23:28+05:30 IST

‘సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు. ఎందుకంటే, ఆ పార్కులో..’’ అంటూ ‘సలార్‌’ టీజర్‌లో టీనూ ఆనంద్‌ డైలాగ్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ 1.46 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌ యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది.

Salaar: ఆ వైభవాన్ని చాటి చెప్పేలా ట్రైలర్‌ తీసుకొస్తాం!

‘సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు. ఎందుకంటే, ఆ పార్కులో..’’ అంటూ ‘సలార్‌’ (Sallar Teaser) టీజర్‌లో టీనూ ఆనంద్‌ డైలాగ్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ 1.46 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌ యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. ఇప్పటికి 100 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. దీనికి వస్తున్న స్పందనకు ఆనందిస్తూ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ (Hombale Films) ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. భారతీయ సినీ వైభవాన్ని చాటి చెప్పేలా ట్రైలర్‌ ఉండనుందని పేర్కొంది.

‘‘సలార్‌’ టీజర్‌ సృష్టించిన ప్రభంజనంలో భాగమై మాపై చూపిన ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. మా టీజర్‌ను ఆదరించినందుకు కృతజ్ఞతలు. భారతీయ సినిమా పరాక్రమానికి ఇదొక ప్రతీక. ప్రస్తుతం మా టీజర్‌ 100 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. మీ ఆదరణ చూశాక.. అసామాన్యమైన చిత్రాన్ని అందించాలనే కోరిక మరింత బలపడింది. ఇక, ఆగస్టు నెలను మార్క్‌ చేసుకుని పెట్టుకోండి. భారతీయ సినీ వైభవాన్ని చాటి చెప్పేలా అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్‌ను మీ కోసం తీసుకురానున్నాం’’ అని ట్వీట్‌ చేశారు. (Thank note to Audience)

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో శ్రుతీహాసన్‌ కథానాయిక.  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొచ్చేందకు దర్శకుడు ప్లాన్‌ చేశారు. ‘సలార్‌’ పార్ట్‌ 1కు ‘సీజ్‌ఫైర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. సెప్టెంబర్‌ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

Updated Date - 2023-07-08T16:23:28+05:30 IST