ఇడియట్‌లా హిట్టవ్వాలి

ABN , First Publish Date - 2023-09-16T00:32:46+05:30 IST

హీరో రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ఇడియట్‌’. సిమ్రాన్‌ శర్మ కథానాయిక....

ఇడియట్‌లా హిట్టవ్వాలి

హీరో రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ఇడియట్‌’. సిమ్రాన్‌ శర్మ కథానాయిక. యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మిస్తున్నారు. ‘పెళ్లిసందడి’ ఫేమ్‌ గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం మాధవ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘మిస్టర్‌ ఇడియట్‌’ పోస్టర్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘నా శిష్యురాలు గౌరీ రోణంకి ఈ చిత్రాన్ని అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించిందని ఆశిస్తున్నాను. రవితేజ ‘ఇడియట్‌’ చిత్రంలా ఈ ‘మిస్టర్‌ ఇడియట్‌’ కూడా పెద్ద హిట్టయి మాధవ్‌ హీరోగా స్థిరపడాలి’ అని ఆకాంక్షించారు. గౌరీ రోణంకి మాట్లాడుతూ ‘‘పెళ్లి సందడి’ చిత్రంలానే ఈ సినిమాకు ప్రేక్షకులు ఘన విజయం చేకూర్చాలి’’ అని కోరారు. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి, నవంబర్‌లో ‘మిస్టర్‌ ఇడియట్‌’ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌. సినిమాటోగ్రఫీ: రామ్‌. ఎడిటర్‌: విప్లవ్‌

Updated Date - 2023-09-16T00:32:54+05:30 IST