HIT 2: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ ఓటీటీలోనే అందుబాటులోకి..

ABN , First Publish Date - 2023-01-05T19:32:24+05:30 IST

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో ఎదిగిన నటుడు అడివి శేష్ (Adivi Sesh). ‘క్షణం’, ‘ఎవరు’, ‘మేజర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తాజాగా అతడు నటించిన మూవీ ‘హిట్ 2’ (HIT 2). మినాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

HIT 2: స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ ఓటీటీలోనే అందుబాటులోకి..

సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో ఎదిగిన నటుడు అడివి శేష్ (Adivi Sesh). ‘క్షణం’, ‘ఎవరు’, ‘మేజర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. తాజాగా అతడు నటించిన మూవీ ‘హిట్ 2’ (HIT 2). మినాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వాల్ పోస్టర్ బ్యానర్‌పై టాలీవుడ్ హీరో నాని (Nani) నిర్మించాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలను పంచిపెట్టింది. థియేటర్‌లో ఈ సినిమాను మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అందరి ఎదురు చూపులకు తెర దించుతూ ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది.

‘హిట్ 2’ ఓటీటీ రైట్స్‌ను ప్రైమ్ వీడియో భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచింది. కానీ, ఏమైందో తెలియదు కానీ మూవీని తొలగించింది. తాజాగా మరో ప్రకటనను విడుదల చేసింది. జనవరి 6నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు వెల్లడించింది. ‘హిట్ 2’ లో రావు రమేష్, సుహాస్, కోమలీ ప్రసాద్, తనికెళ్ల భరణి, గీతా భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కథ విషయానికి వస్తే.. కృష్ణ దేవ్ అలియాస్ (అడివి శేష్) వైజాగ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తుంటాడు. క్రిమినల్స్ తెలివిగా ఆలోచించరని కోడిబుర్రలని తీసిపారేస్తుంటాడు. ఆర్య (మినాక్షి చౌదరి)తో కలసి సహజీవనం చేస్తుంటాడు. విశాఖలోని ఓ పబ్‌లో దారుణమైన హత్య జరుగుతుంది. ఓ అమ్మాయి చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి కనిస్తాయి. కానీ, ఆ శరీర భాగాలన్ని వేర్వేరు అమ్మాయిలకు చెందినవని పరిశోధనలో తెలుస్తోంది. ఈ కేసును కేడీ ఏ విధంగా ఛేదించాడు..? కేసును ఛేదించే క్రమంలో అతడికీ ఎదురైన సవాళ్లు ఏంటీ..? అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Updated Date - 2023-01-05T19:33:48+05:30 IST