Hi Nanna Trailer: ఎమోషనల్.. ఇక ఊహించుకోండి

ABN , First Publish Date - 2023-11-24T18:13:02+05:30 IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర‌ పడుతుండడంతో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Hi Nanna Trailer: ఎమోషనల్.. ఇక ఊహించుకోండి
hi nanna

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్న’(Hi Nanna). వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది.

ఇప్పటికే విడుదల చేసిన సినిమా పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. డిసెంబర్ 7న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండ‌గా ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నాని వినూత్నంగా ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల సీజన్ కావడంతో.. రాజకీయ నాయకుడి గెటప్‌లో రెడీ అయ్యి..‘హాయ్ నాన్న’ పేరుతో ఓ పార్టీ (Hi Nanna Party) పెట్టినట్లుగా చెప్పుకొచ్చి ఓ మేనిఫెస్టో రెడీ చేసి గ‌త‌ శనివారం విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టో అంటూ తాజాగా నాని తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు.


అయితే సినిమా విడుదల తేదీ దగ్గర‌ పడుతుండడంతో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను పూర్తిగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎమోషన్స్, చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందించారు. 2 నిమిషాల 41 సెకండ్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్ అద్యంతం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించి ఎమోషనల్ జర్నీ చేయించేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న శృతిహసన్ కూడా ఓ సన్నివేశంలో మెరిసింది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు సంగీతం అందించిన హేసమ్‌ అబ్దుల్‌ వాహెబ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి.

Updated Date - 2023-11-24T18:39:31+05:30 IST