Nani30: నాని30 సినిమా టైటిల్ ఇదే !

ABN , First Publish Date - 2023-07-13T12:11:15+05:30 IST

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న నాని30 సినిమాకి 'హాయ్ నాన్న' అనే పేరు ఖరారు చేశారు. ఈ ప్రచార చిత్రాలు ఈరోజు విడుదల చేశారు, అందులో నాని, మృణాల్ ఠాకూర్, చిన్న పాప వున్నవి చూపించి ఇది తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో వున్న కథ అని చెప్పారు.

Nani30: నాని30 సినిమా టైటిల్ ఇదే !
Nani30 titled as Hi Nanna

నాని (Nani), మృణాల్ ఠాకూర్ (MrunalThakur) జంటగా నటిస్తున్న నానీ30 #Nani30 సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ అన్నీ ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా తండ్రి, కూతుళ్ళ అనుబంధం అని ముందే చెప్పారు, విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదే చెప్తున్నాయి. అందుకనే ఏమో ఈ సినిమాకి 'హాయ్ నాన్న' (HiNanna) అని పేరు పెట్టారు. శౌర్యువ్ (Shouryuv) దీనికి దర్శకుడు. మృణాల్ ఠాకూర్ నాని ని హాయ్ నాన్నా అని పిలిచి పరిచయం చేసుకుంటుంది. ఎందుకంటే నాని కూతురు ఆమెకి అతను మా నాన్న అని పరిచయం చేసింది కనక.

HiNanna.jpg

నాని ఏమి చేసినా వైవిధ్యంగానే చేస్తాడు కదా, అందుకని ఈ సినిమా కూడా అలానే వుండబోతోంది అని అనుకుంటున్నారు. ఈ టైటిల్ తో పాటు ఒక చిన్న పాట కూడా ఈ ప్రచార వీడియోలో చూపించారు. డిసెంబర్ 21న (December 21) విడుదల తేదీ అని కూడా ఇందులో వేసేసారు. ఈ ప్రచార చిత్రాలు చూడటానికి చాలా ఆసక్తికరంగా వున్నాయి, అలాగే ఇందులో ఆ పాప, నాని, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా, అలాగే భావోద్వేగంగా కూడా వుండే అవకాశాలు మెండుగా వున్నాయి. నాని కూడా చాలా ఫ్రెష్ గా కనపడుతున్నాడు.

'సీతారామం' తరువాత మృణాల్ ఠాకూర్ చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకి సంగీతం హేశం అబ్దుల్ వాహబ్ (Hesham Abdul Wahab) అందచేశారు.

Updated Date - 2023-07-13T12:11:15+05:30 IST