Mega 156 : ముల్లోకాల కథకు... ఐదుగురు?

ABN , First Publish Date - 2023-10-31T16:02:09+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో 'మెగా 156’ (mega 156) వర్కింగ్‌ (Vassista) టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే! యు.వి. క్రియేషన్స్  సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Mega 156 : ముల్లోకాల కథకు... ఐదుగురు?

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో 'మెగా 156’ (mega 156) వర్కింగ్‌ (Vassista) టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే! యు.వి. క్రియేషన్స్  సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది. సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి పాట రికార్డింగ్‌తో పనులు మొదలుపెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రీ- ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం హీరోయిన్స్ వేటలో ఉన్నారు.

మొదటి నుంచి ఈ చిత్రంలో ముగ్గురు, నలుగురికి స్కోప్‌ ఉందనే టాక్‌ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఐదుగురు హీరోయిన్లను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరీలో అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లతోపాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని నెట్టింట వైరల్‌ అవుతోంది. దేవ, మానవ, పాతాళం ఈ మూడు లోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని టాక్‌. ఇందులో రానా దగ్గుబాటి కూడా భాగం కానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-10-31T16:02:32+05:30 IST