Avika Gor: ఈ క్షణాలని.. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను

ABN , First Publish Date - 2023-01-04T19:44:20+05:30 IST

‘నా జ‌ర్నీలో నేను చేసిన ప్ర‌తి విష‌యాన్ని ఆడియెన్స్ చ‌క్క‌గా రిసీవ్ చేసుకుని ఎంక‌రేజ్ చేశారు.. ఈ క్షణాలని.. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’ అన్నారు హీరోయిన్

Avika Gor: ఈ క్షణాలని.. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను
Heroine Avika Gor

‘నా జ‌ర్నీలో నేను చేసిన ప్ర‌తి విష‌యాన్ని ఆడియెన్స్ చ‌క్క‌గా రిసీవ్ చేసుకుని ఎంక‌రేజ్ చేశారు.. ఈ క్షణాలని.. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’ అన్నారు హీరోయిన్ అవికా గోర్ (Avika Gor). ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌‌పై భోగేంద్ర గుప్తా‌తో కలిసి ఆమె నిర్మిస్తున్న చిత్రం ‘పాప్ కార్న్’ (Popcorn). అవికా గోర్‌, సాయి రోన‌క్ (Sai Ronak) జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధ‌వారం ఈ చిత్ర ట్రైలర్ కింగ్ అక్కినేని నాగార్జున (King Nagarjuna) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

నిర్మాత, హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే ప్రారంభ‌మైంది. ఆ సినిమాలో నాగార్జున‌గారితో ప‌రిచయం ఏర్ప‌డింది. నాకు, రాజ్ త‌రుణ్‌ (Raj Tharun)కి తొలి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. అయితే మా కాన్ఫిడెన్స్ ఎక్క‌డా దెబ్బ తిన‌కూడ‌ద‌ని ఆయ‌న ఎప్పుడూ మా వెంటే ఉండేవారు. మంచి నిర్మాతే కాదు.. మంచి మ‌నిషి కూడా. మా సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌చ్చినందుకు ఆయ‌నకు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. పాప్‌కార్న్ సినిమా విష‌యానికి వ‌స్తే.. నేను చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ సినిమాకు నిర్మాత‌గా చేయ‌టం రిస్క్ అని అన్నారు. కానీ నేను ఆ రిస్క్ తీసుకోవ‌టం ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను ఈ రిస్క్ తీసుకోవ‌టానికి స‌పోర్ట్ చేసిన నా త‌ల్లిదండ్రుల‌కు థాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కులు నేను చేసిన ప్ర‌తి సినిమాకు అప‌రిమిత‌మైన ప్రేమాభిమానాల‌ను అందించారు. వారిచ్చిన ఆశీర్వాదాల‌తోనే నాకు ఏదైనా కొత్త‌గా చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అలాగే ఈ సినిమా నిర్మాత‌లు చ‌ల‌ప‌తి రాజుగారు, భోగేంద్ర గుప్తాగారు నాపై న‌మ్మ‌కం ఉంచారు వారికి థాంక్స్‌. మా కాన్సెప్ట్‌, డైరెక్ట‌ర్‌ను న‌మ్మారు. మా టీమ్‌లో ఒక‌రిపై ఒక‌రికి ఉన్న న‌మ్మ‌కంతోనే ఈ ప్రాజెక్ట్ సాధ్య‌మైంది. నా జ‌ర్నీలో నేను చేసిన ప్ర‌తి విష‌యాన్ని ఆడియెన్స్ చ‌క్క‌గా రిసీవ్ చేసుకుని ఎంక‌రేజ్ చేశారు. ఈ క్ష‌ణాలు నాకెంతో స్పెష‌ల్‌. నా జీవితంలో మ‌ర‌చిపోలేను. తెలుగు ప్రేక్ష‌కుల‌ (Telugu Audience)ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఈ సినిమా కాన్సెప్ట్ డిఫ‌రెంట్‌గా ఉంటూనే.. టెక్నిక‌ల్‌గా ఛాలెంజింగ్ మూవీ. లిఫ్ట్‌లోనే యాక్టింగ్‌, పాట‌లు అన్నీ చేయాలి. ఇంత‌కు ముందు నేను చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైంది’’ అని తెలిపారు.

Updated Date - 2023-01-04T19:44:22+05:30 IST