సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Srikanth Sri Appalaraju: ఇక డైరెక్షన్ మాత్రమే..

ABN, First Publish Date - 2023-02-20T19:27:54+05:30

రెండు పడవల ప్రయాణం నా వరకు సరిపడదని నాకనిపించింది.. అందుకే నాకు ఎంతో ఇష్టమైన సినిమా రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని..

Srikanth Sri Appalaraju with SP Balu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు పడవల ప్రయాణం నా వరకు సరిపడదని నాకనిపించింది.. అందుకే నాకు ఎంతో ఇష్టమైన సినిమా రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అనుకుంటున్నానని తెలిపారు ‘చీమ-ప్రేమ-మధ్యలో భామ’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు (Srikanth Sri Appalaraju). సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ (Software Engineer)గా తిరుగులేని ట్రాక్ రికార్డ్ కలిగి, అనేక సంస్థల్లో విదేశాల్లోనూ పని చేసిన అనుభవం కలిగిన శ్రీకాంత్... ‘చీమ-ప్రేమ-మధ్యలో భామ’ (Cheema - Prema - Madhyalo Bhaama) చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి చిత్రంతోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకుని తన ప్రతిభను చాటుకున్నారు. మాగ్నం ఓపస్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం.. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, లండన్ తదితర దేశాల ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ (Best Director) అవార్డును ఆయన తెచ్చిపెట్టింది.

చిన్నప్పటి నుంచి సంగీతం, సాహిత్యంపై మక్కువ పెంచుకున్న శ్రీ.. అప్పటి నుంచే కవితలు, కథలు రాసి మెప్పిస్తుండేవారట. ఇంజినీరింగ్ పట్టభద్రులైన శ్రీకాంత్... బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ చేసి, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ (New York Film Academy) నుంచి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశారు. సినిమా రంగంలోకి ప్రవేశించే ముందు... కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసి, ఫిల్మ్ మేకింగ్ పట్ల పరిపూర్ణమైన అవగాహనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘మై కౌబాయ్, ఎందుకిలా, టేక్ ఇట్ ఈజీ’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌ (Short Films)కు వచ్చిన గుర్తింపు, అనుభవంతో ‘చీమ-ప్రేమ-మధ్యలో భామ’ అంటూ మెగాఫోన్ పట్టారు. ‘శ్రీకాంతరంగం’ పేరుతో తను వ్రాసుకున్న పుస్తకంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించుకున్న ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టర్నెడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఇకపై ‘దర్శకుడు’గానే కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుపుతున్నారు. త్వరలో తన ద్వితీయ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమైన.. శ్రీ.. ఆ సినిమా కార్యరూపం దాల్చకముందే మూడో చిత్రానికి సంబంధించి సన్నాహాలు చేస్తుండటం విశేషం. కాగా.. రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ, జేమ్స్ కామెరూన్ తన అభిమాన దర్శకులని చెబుతున్న శ్రీకాంత్.. తను దర్శకత్వం వహించిన చిత్రానికి గాత్రం అందించడమే కాకుండా.. గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సినిమా చూసి... చిత్ర బృందాన్ని మెచ్చుకోవడాన్ని.. జీవితంలో ఎప్పుడూ మరిచిపోనని తెలిపారు.(Director Srikanth Sri Appalaraju)

Updated Date - 2023-02-20T19:36:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!