Hema malini - Allu Arjun: హిందీ హీరోలైతే వెనకాడతారు!

ABN , First Publish Date - 2023-05-12T14:57:18+05:30 IST

'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్‌ క్రేజ్‌ ప్యాన్‌ ఇండియా స్థాయికి చేరుకుంది. ఆ చిత్రంలో ఆయన నటనకు, డైలాగ్‌ డెలివరీకి అభిమానులే కాదు అగ్ర నటీనటులు ఫిదా అయ్యారు.

Hema malini - Allu Arjun: హిందీ హీరోలైతే వెనకాడతారు!

'పుష్ప' (Pushpa)సినిమాతో అల్లు అర్జున్‌ క్రేజ్‌ ప్యాన్‌ ఇండియా స్థాయికి చేరుకుంది. ఆ చిత్రంలో ఆయన నటనకు, డైలాగ్‌ డెలివరీకి అభిమానులే కాదు అగ్ర నటీనటులు ఫిదా అయ్యారు. తాజాగా అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ హేమమాలిన. బన్ని నటించిన పాత్రల గురించి ఆమె మాట్లాడారు. (Hema Malini Slams Bollywood Heroes)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమమాలిని మాట్లాడుతూ ‘‘బన్నీ నటించిన ‘పుష్ప’ చిత్రమంటే నాకు చాలా ఇష్టం. పుష్పరాజ్‌గా అతని లుక్‌ చూసి ఆశ్చర్యపోయాను (Hemamalini Praising Allu Arjun). ‘పుష్ప’ విడుదలయ్యాక అతని డాన్స్‌, మేనరిజంను ఎంతోమంది అనుకరింయారు. సెలబ్రిటీలు సైతం డాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. గతంలో నేను చూసిన ఒక సినిమాలో అల్లు అర్జున్‌ చాలా అందంగా.. స్టైల్‌గా ఉన్నాడు. అలా ఉండే అతడు.. ‘పుష్ప’ కోసం పూర్తిగా తన లుక్‌ని మార్చేశాడు. లుంగీలో మాస్‌గా, డీ గ్లామర్‌గా కనిపించాడు. ఎలాంటి గెటప్‌ వేసినా అతడు హీరోలానే ఉంటాడు. అలా డీ గ్లామర్‌ రోల్‌ చేయడానికి అతను అంగీకరించడం గొప్ప విషయం. ఎంతో అభినందనీం. హిందీ సినిమాల్లో హీరోలు అలా కనిపించడానికి, అలాంటి పాత్రలు చేయడానికి ఆలోచిస్తారు. ఒక సినిమాలో కాస్త నల్లగా కనిపించాలంటేనే ధర్మేంద్ర వెనకాడారు. ఆ విషయం నాకు ఇప్పటికీ గుర్తుండి’’ అని అన్నారు. (pushpaRaj)

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’ (Pushpa 2)చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది ఇటీవల విడుదలైన టీజర్‌, లుక్‌తో సినిమాకు మరింత క్రేజ్‌ పెరిగిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-05-12T15:01:00+05:30 IST