Small Screen MegaStar: చిరంజీవిని తట్టుకోలేక కర్ణాటక పారిపోయాడు, కానీ అక్కడ కూడా...

ABN , First Publish Date - 2023-04-21T14:14:35+05:30 IST

అతను అచ్చం చిరంజీవిలా ఉండటమే అతనికి శాపం అయింది. అందుకే తెలుగులో ఒకేరోజు మూడు షిఫ్ట్ లలో పనిచేసినా ఒక్కసారిగా డౌన్ అయిపోయి, కర్ణాటక పరిశ్రమలో చేద్దామని అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ ఇంకో రకం అయినా ప్రాబ్లెమ్. ఇంతకీ అతనెవరంటే...

Small Screen MegaStar: చిరంజీవిని తట్టుకోలేక కర్ణాటక పారిపోయాడు, కానీ అక్కడ కూడా...
Chiranjeevi

అప్పట్లో సినిమాల్లో పాత్రలు తాగితే టీవీ సీరియల్స్ వేపు చూసేవాడు చాలామంది నటీనటులు. అలా టీవీ లోకి వచ్చి స్థిరపడినవాళ్లు కూడా వున్నారు, అందులో రాజ్ కుమార్ (Rajkumar) ఒకడు. అట్టహాసంగా సినిమా కెరీర్ ప్రారంభించి రోజుకు మూడు షిఫ్ట్ లలో పనిచేసి బిజీ గా వుండే నటుల్లో రాజ్ కుమార్ ఒకడు. దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) పరిచయం చేసిన నటుల్లో కూడా ఒకడు రాజ్ కుమార్. కానీ అతని దురదృష్టం అతను సుమారు 75 సినిమాలు చేసాక టీవీ లో బాగా పాపులర్ అయ్యాడు తరువాత. బుల్లితెర మెగాస్టార్ (MegaStar) అని కూడా అనేవారు అతన్ని. ఇంతకీ అతని సినిమా కెరీర్ ఫేడ్ అవడానికి కారణం కూడా ఆ 'మెగాస్టార్' అన్న చిరంజీవి. అదెలా అంటే...

రాజకుమార్ అచ్చం మెగా స్టార్ చిరంజీవిలా (Chiranjeevi) ఉంటాడు. అప్పట్లోనే అతన్ని అందరూ చిరంజీవి డూప్ అని, చిన్న చిరంజీవి అని ఆలా అంటూ ఉండేవారు. ఎందుకంటే రాజకుమార్ అచ్ఛం చిరంజీవి లానే ఉండేవాడు. అదే అతనికి మైనస్ అయింది. బయట అందరూ అనుకోవటానికి బాగుంటుంది కానీ, అది ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మైనస్ అయింది అని చెప్పాడు అలనాటి నటుడు రాజకుమార్, ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.

Raj-Kumar.jpg

అయితే తను చిరంజీవిలా ఉన్నంత మాత్రాన అతనికి నాకు పోలికేలేదు అన్నాడు. నన్ను చిరంజీవి లాగ వున్నాను అనేవారు కానీ, చిరంజీవి గారి స్టేచర్ ఎక్కడ, నాది ఎక్కడ అని చెప్పాడు. అలాగే చిరంజీవి గారు చాల డౌన్ తో ఎర్త్ మనిషి అని చెప్పాడు. సుమారు 75 సినిమాలు చేసాక ఒక్కసారిగా రాజకుమార్ డౌన్ అయిపోయాడు తెలుగులో. కేవలం అతను చిరంజీవి లా ఉండటం వలన ఇదంతా జరిగింది. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఇంక తట్టుకోలేక కన్నడ పరిశ్రమలో ట్రై చేద్దాం అని కర్ణాటక పారిపోయాడు రాజకుమార్.

కానీ అక్కడ కూడా ఇంకో అడ్డు తగిలింది. అక్కడ రాజకుమార్ అనే ఒక లెజెండరీ పర్సన్ కన్నడ కంఠీరవ, కన్నడ రాజకుమార్ (Kannada Rajkumar) వున్నాడు. రాజకుమార్ అనే పేరు అతనొక్కడికే ఉండాలి అని, ఈ తెలుగు రాజకుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తన పేరు రాజ్ కమల్ గా మార్చుకుంటున్నాను అని చెప్పాడు. అక్కడ కూడా ఒక ఏడు సినిమాలు చేసాడు కానీ అంత స్టార్ డమ్ రాలేదు, అందుకని అక్కడ కూడా ఉండలేక ఇంకా టీవీ లోకి వెళ్ళాడు రాజకుమార్. బుల్లితెర మెగాస్టార్ అయ్యాడు రాజ్ కుమార్.

Updated Date - 2023-04-21T14:31:50+05:30 IST