అందరికంటే గొప్పవాడు
ABN , First Publish Date - 2023-05-20T03:02:47+05:30 IST
సుడిగాలి సుధీర్ హీరోగా లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి...

సుడిగాలి సుధీర్ హీరోగా లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దివ్య భారతి కథానాయిక. నరేశ్ కుప్పిలి దర్శకుడు. చంద్రశేఖర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్ నిర్మాతలు. ఈ చిత్రానికి ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పేరు ఖరారు చేశారు. శనివారం సుధీర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘‘మంచి కాన్సె్‌ప్టతో రూపొందుతున్న చిత్రమిది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి వెనుకంజ వేయడం లేదు. భీమ్స్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద’’ని దర్శకుడు తెలిపారు.