కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hari Hara Veera Mallu : ఆయన్ను చూసే ఆసక్తి కలిగింది!

ABN, First Publish Date - 2023-09-09T13:52:38+05:30

పవన్‌కల్యాణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య మూవీస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్‌ యుద్థ విద్యల కోసం ‘షావోలిన్‌ వారియర్‌ మంక్‌ అకాడమీ’లో పవన్‌ శిక్షణ తీసుకున్నారు.

పవన్‌కల్యాణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (hariHara veeramallu). క్రిష్‌ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో మెగా సూర్య మూవీస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్‌ యుద్థ విద్యల కోసం ‘షావోలిన్‌ వారియర్‌ మంక్‌ అకాడమీ’లో పవన్‌ శిక్షణ తీసుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్‌ హర్ష్‌ వర్మ కూడా ఈ చిత్రం సందడి చేయనున్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌ వల్లే నాకు నటనపై ఆసక్తి కలిగింది. పవన్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. సెట్‌లో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాను. చిన్న విషయాన్ని కూడా నిశితంగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. క్షణాల్లో సీన్‌ మార్చినా ఆయన వెంటనే అర్థం చేసుకుంటారు. శిక్షణ ఇచ్చే సమయంలో నాకూ నటనపై ఆసక్తి ఉందని వెల్లడించాను. అంతే లుక్‌ టెస్ట్‌ చేయించారు. టెస్ట్‌ ఓకే అయింది. యాక్టింగ్‌ చేయాలనే కోరిక నాలో పుట్టడానికి కారణం ఆయనే. ‘హరిహర వీరమల్లు’ క్లైమాక్స్‌ ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ప్రస్తుతం దీనితోపాటు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తున్నాను’’ అని అన్నారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఎ.ఎంరత్నం సినిమా షూటింగ్‌ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివరికి సినిమా పూర్తవుతుందని , వచ్చే ఎన్నికల కంటే ముందే చిత్రాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో పవన్‌ సరసన నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు.

Updated Date - 2023-09-09T13:52:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!