Harish Shankar - Chandrayan 3: ఆ ట్వీట్‌తో విపరీతంగా ట్రోలింగ్‌!

ABN , First Publish Date - 2023-08-24T12:40:10+05:30 IST

మీమర్స్‌ తయారు చేసిన ఓ మీమ్‌ని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌కు గురయ్యారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar(. ‘చంద్రయాన్‌-3’ (Chandrayan -3) జాబిల్లిపై దిగ్విజయంగా ల్యాండ్‌ అయిన నేపథ్యంలో యావత్‌ భారతావని సంబరాలు చేసుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కష్టానికి ఫలితం దక్కిందని, దేశం కోసం వారు సాధించిన ఘనత ఇదని గర్విస్తున్నారు.

Harish Shankar - Chandrayan 3: ఆ ట్వీట్‌తో విపరీతంగా ట్రోలింగ్‌!

మీమర్స్‌ తయారు చేసిన ఓ మీమ్‌ని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌కు గురయ్యారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar(. ‘చంద్రయాన్‌-3’ (Chandrayan -3) జాబిల్లిపై దిగ్విజయంగా ల్యాండ్‌ అయిన నేపథ్యంలో యావత్‌ భారతావని సంబరాలు చేసుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు కష్టానికి ఫలితం దక్కిందని, దేశం కోసం వారు సాధించిన ఘనత ఇదని గర్విస్తున్నారు. ఈ తరుణంలో ‘ఫ్లాగ్‌ ఆన్‌ మూన్‌.. మూన్‌ ఆన్‌ ఫ్లాగ్‌’ అంటూ చంద్రుడిపై ఎగిరిన భారతీయ జెండాను, పాకిస్థాన్‌ జెండాపై ఉన్న చంద్రుడిని కంపేర్‌ చేస్తూ బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌’ అంటూ బాలకృష్ణ చెబుతున్నట్లుగా క్రియేట్‌ చేసిన మీమ్‌ను పోస్ట్‌ చేసి ‘హ..హ..హ మన జనాల సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌’ ఇది అంటూ హరీశ్‌ శంకర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ మీమ్‌ చంద్రయాన్‌ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్‌ అయిన కాసేపటి నుంచే సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతోంది. దానినే హరీశ్‌ శంకర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి భారతదేశం మొత్తం ఆనందంగా, గర్విస్తున్న వేళ.. వేరే దేశంతో పోలిక అవసరమా? ఇది మన జనాల సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌’ అని ట్వీట్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. (Harish Shankar tweet viral)

హరీశ్‌ ట్వీట్‌కు కొందరు సపోర్ట్‌గా ఉంటే... ఎక్కువ శాతం నెగటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నీకు సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ ఉంటే ఈ పోస్ట్‌ చేయవు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తే... మరో నెటిజన్‌ ఈ ఆనంద సమయంలో వేరే దేశంతో మనకు పోలిక ఏంటి? ఒక వేళ అలా కంపేర్‌ చేసుకోవాలంటే చైనా, రష్యా, అమెరికాలతో మన దేశాన్ని పోల్చాలి కానీ.. పాకిస్థాన్‌లో పోలిక ఏంటి? అని ఒకరు కామెంట్ చేశారు.

‘జెండాలో చంద్రుడి బొమ్మ పెట్టుకుని మురిసిపోయే దేశం కాదు.. చంద్రుడిపై భారత జెండా ఎగరేసిన దేశం మనది.. జై భారత్‌ మాతా’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. మనదేశాన్ని, పాకిస్థాన్‌ను కంపేర్‌ చేస్తూ ఎవరో చేసిన పోస్ట్‌ని మీరు పోస్ట్‌ చేయకుండా ఉండాల్సింది హరీశ్‌గారూ అంటూ కొందరు, మనం సాధించామని పక్క దేశాన్ని తక్కువ చేయడం ఎందుకు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-24T13:19:56+05:30 IST